Begin typing your search above and press return to search.

కసిగా ప్రయత్నిస్తున్న మోక్షజ్ఞ

By:  Tupaki Desk   |   30 Dec 2018 11:33 AM GMT
కసిగా ప్రయత్నిస్తున్న మోక్షజ్ఞ
X
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి రాబోతున్నాడు అంటూ గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే బాలకృష్ణ మాత్రం తన కొడుకును సినిమాలో తీసుకు వచ్చేందుకు సరైన సమయం కోసం వెయిట్‌ చేస్తున్నాడు. పలు దేశాల్లో మోక్షజ్ఞ నటన మరియు డాన్స్‌ లో శిక్షణ తీసుకుంటున్నాడని, మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. అయితే మోక్షజ్ఞ ఎలా ఉన్నాడనే విషయం రెండు సంవత్సరాలుగా ఎవరికి తెలియదు. మీడియా ముందుకు ఆయన రాకపోవడంతో మోక్షజ్ఞ తాజా లుక్‌ పై క్లారిటీ లేదు.

మోక్షజ్ఞ చాలా లావు అయ్యాడని, అందుకే ఆయన్ను బయటకు కనిపించకుండా బాలయ్య అండ్‌ కో ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొందరు చెబుతూ వచ్చారు. మోక్షజ్ఞను సర్‌ ప్రైజ్‌ గా ఫ్యాన్స్‌ ముందుకు తీసుకు రావాలనుకుంటున్నాడని మరి కొందరు అన్నారు. తాజాగా జరిగిన ‘ఎన్టీఆర్‌’ ఆడియో విడుదల కార్యక్రమంలో నందమూరి ఫ్యామిలీ అంతా కనిపించింది కాని, మోక్షజ్ఞ మాత్రం కనిపించలేదు. మోక్షజ్ఞను హైడ్‌ చేస్తుండటంకు కారణం ఏంటో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీగా తెలియదు.

తాజాగా ప్రసాద్‌ ల్యాబ్‌ లో కేజీఎఫ్‌ సినిమా ప్రత్యేక షోను తల్లిదండ్రులతో కలిసి చూసేందుకు మోక్షజ్ఞ వచ్చాడట. ఆ సమయంలో కొందరి కంట పడ్డట్లుగా తెలుస్తోంది. మోక్షజ్ఞ చాలా లావు తగ్గాడని, సినిమాల్లో వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వాలనే కసితో లావు తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నందమూరి యువ కెరటం మంచి ఎత్తు కూడా అయ్యాడని అంటున్నారు. మరింత లావు తగ్గిన తర్వాత మొదటి సినిమాను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసే అవకాశం ఉంది. ‘ఎన్టీఆర్‌’ లో మోక్షజ్ఞ కనిపిస్తాడనే ప్రచారం జరిగినా, అది పుకార్లే అని తేలింది. ఆ హెవీ బాడీతో కనిపిస్తే బాగోదని బాలయ్య భావిస్తున్నాడట. అందుకే మోక్షజ్ఞ కనిపించక పోవచ్చు. బరువు తగ్గిన తర్వాత మోక్షజ్ఞ లుక్‌ ను రివీల్‌ చేసే అవకాశం ఉంది.