Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ సీక్రెట్‌ రివీల్‌ చేసిన స్వాతిముత్యం

By:  Tupaki Desk   |   1 Jun 2023 12:00 PM GMT
మోక్షజ్ఞ సీక్రెట్‌ రివీల్‌ చేసిన స్వాతిముత్యం
X
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ విషయం మరింత ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో మోక్షజ్ఞ గురించి చిన్న విషయం అయినా కూడా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ సమయంలో మోక్షజ్ఞ గురించి ఒక సీక్రెట్‌ ను బెల్లంకొండ వారి చిన్నబ్బాయి గణేష్ బాబు రివీల్ చేయడం జరిగింది. దాంతో మళ్లీ నందమూరి మోక్షజ్ఞ వార్తల్లో నిలిచాడు. మెగా ఫ్యాన్స్ తో పాటు నందమూరి అభిమానులు ఈసారి మోక్షజ్ఞ గురించి చర్చించుకునే విధంగా బెల్లంకొండ గణేష్ బాబు వ్యాఖ్యలు చేశాడు.

గణేష్ హీరో గా నటించిన నేను స్టూడెంట్‌ సర్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో గణేష్ మాట్లాడుతూ... తనకు మోక్షజ్ఞకు ఉన్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు. ఆ స్నేహంతో అప్పట్లో ఇద్దరం కలిసి బాగా తిరిగేవాళ్లం అంటూ గణేష్ పేర్కొన్నాడు. ఆ సమయంలోనే చరణ్‌ సినిమా రచ్చ కు వెళ్లామని గణేష్‌ పేర్కొన్నాడు.

రచ్చ సినిమా కు మోక్షజ్ఞతో కలిసి వెళ్లిన సమయంలో థియేటర్ లో కొందరు గుర్తు పట్టి బాలకృష్ణ గారి అబ్బాయి చరణ్‌ సినిమా కు వచ్చాడు అంటూ గట్టిగా మొత్తుకోవడంతో కొద్ది సమయం థియేటర్ లో సందడి వాతావరణం ఏర్పడిందని గణేష్ అన్నాడు. ఆ సమయంలో మోక్షజ్ఞ సైలెంట్‌ గా ఉండి కొద్ది సమయం తర్వాత బయట కు వచ్చినట్లు తెలియజేశాడు.

ఒక హీరో ఫ్యామిలీ కి చెందిన వారు మరో హీరో సినిమా కు వెళ్లడం అనేది కచ్చితంగా పెద్ద విషయం. అలాంటిది చరణ్ మూవీ కి బాలయ్య తనయుడు వెళ్లాడు అంటే ఇప్పట్లో అయితే విషయం వైరల్‌ అయ్యేది.

ఒకప్పుడు మోక్షజ్ఞ తండ్రి అయిన బాలకృష్ణ మరియు గణేష్ యొక్క తండ్రి బెల్లంకొండ సురేష్ ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. అలా మోక్షజ్ఞ మరియు గణేష్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌.

గణేష్‌ మొదటి సినిమా స్వాతిముత్యం తో నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. అలాగే లుక్ పరంగా కూడా మెప్పించాడు. ఇప్పుడు నేను స్టూడెంట్‌ సర్‌ సినిమా తో మరోసారి వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. మొదటి సినిమా తో దక్కని కమర్షియల్ సక్సెస్ ఈ సినిమా తో అయినా దక్కేనా చూడాలి.

ఒక వైపు అన్న బెల్లంకొండ శ్రీనివాస్ సక్సెస్ కోసం పోరాడుతూ ఉన్నాడు. మరి గణేష్ పరిస్థితి కూడా అదేనా లేదంటే తమ్ముడు వరుస సక్సెస్ లను నేను స్టూడెంట్‌ సర్‌ తో మొదలు పెట్టేనా అనేది కాలమే నిర్ణయించాలి.