Begin typing your search above and press return to search.

అమ్మా నాన్న విడిపోయాకే సంతోషంగా ఉన్నారు!-శ్రుతి

By:  Tupaki Desk   |   25 May 2021 4:30 PM GMT
అమ్మా నాన్న విడిపోయాకే సంతోషంగా ఉన్నారు!-శ్రుతి
X
విడిగా ఉన్నా క‌లిసి త‌మ పిల్ల‌ల బాగోగులు చూసుకోవ‌డం అన్న‌ది నేటి ఆధునిక విధానం. విడాకుల త‌ర్వాతా కొన్నిటి కోసం క‌ల‌వాల్సిందే. క‌మ‌ల్ హాస‌న్ - సారిక జంట విడిపోయి కొన్నేళ్ల‌య్యింది. అయినా ఆ ఇద్ద‌రూ కుమార్తెలు శ్రుతి- అక్ష‌ర ను ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు. వార‌సుల‌కు ఎలాంటి లోటు లేకుండా ఆద‌రించి ఎదిగేందుకు స‌హ‌క‌రిస్తున్నారు.

అందుకేనేమో శ్రుతిహాస‌న్ త‌న ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకున్నారు. ``అమ్మా నాన్న‌ విడిపోతున్నందుకు నేను సంతోషించానే కానీ విచారించ‌లేదు. ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి లేర‌ని.. కొన్ని కారణాల వల్ల బలవంతంగా వారు క‌లిసి ఉండాల‌ని నేను అనుకోను`` అని శ్రుతి అన్నారు. విడిపోయినా ఆ ఇద్ద‌రూ `అద్భుతమైన తల్లిదండ్రులు`గా కొనసాగుతున్నారు అని అన్నారు. నేను నా తండ్రికి చేరువ‌గా ఉన్నాన‌ని శ్రుతి అంగీక‌రించారు.

అమ్మ‌ బాగా పనిచేస్తోంది .. మా జీవితంలో కూడా ఒక భాగం. వారు ఇద్దరూ ప్రత్యేకంగా అద్భుతమైన అందమైన వ్యక్తులు.. అని శ్రుతి అన్నారు. వారు విడిపోయినప్పుడు నేను చాలా చిన్నదానిని. వాళ్లు ఆ త‌ర్వాతే సంతోషంగా ఉన్నారు.. వారు కలిసి ఉన్నప్ప‌టికంటే..! అంటూ కాస్త ఆవేద‌న‌గానే శ్రుతి తెలిపారు.

సూపర్ స్టార్ కమల్ హాసన్ 1980 లలో చాలా సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత నటి సారిక‌ను వివాహం చేసుకున్నారు. కమల్ హాసన్ ఇంతకుముందు నర్తకి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. వారు 1988 లో విడాకులు తీసుకున్నారు. కమల్ హాసన్ -సారిక‌ 1986 లో వారి మొదటి బిడ్డ శ్రుతి హాసన్ కు స్వాగతం పలికారు. వారి రెండవ సంతానం అక్షర ఈ జంటకు 1991 లో జన్మించింది. కుమార్తెలిద్ద‌రూ క‌థానాయిక‌లుగా కొన‌సాగుతున్నారు.

సారిక‌- కమల్ హాసన్ 2004 లో విడాకులు తీసుకున్నారు. అమితాబ్ బచ్చన్ -ధనుష్ కలిసి నటించిన షమితాబ్ అనే కామెడీ డ్రామాతో అక్షర 2015 లో సినీరంగ ప్రవేశం చేసింది. సాలార్ అనే చిత్రంలో బాహుబలి స్టార్ ప్రభాస్‌తో ఆమె స్క్రీన్ స్పేస్ పంచుకుంటుంది.