Begin typing your search above and press return to search.

డేటింగ్ గురించి కుమార్తెకి మామ్ గౌరీఖాన్ స‌ల‌హా

By:  Tupaki Desk   |   22 Sep 2022 2:30 AM GMT
డేటింగ్ గురించి కుమార్తెకి మామ్ గౌరీఖాన్ స‌ల‌హా
X
సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ లో డేటింగ్..ఎఫైర్లు స‌ర్వ సాధార‌ణం. ఒక‌టి బ్రేక‌ప్ జ‌రిగిన త‌ర్వాత వెంట‌నే మ‌రొక‌టి. అటుపై మరో డేటింగ్ స్టోరీ అక్క‌డ సాధార‌ణం. బాలీవుడ్‌తోపాటు కోలీవుడ్..టాలీవుడ్ లో ఇండస్ట్రీలలో ఎప్పుడూ ఏదో ఒక యాక్ట‌ర్‌ డేటింగ్ న్యూస్ నెట్టింట రౌండ‌ప్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి వార్త ఒక‌టి క‌ర‌ణ్ జోహార్ టాక్ షో వేదిక‌గా హైలైట్ అవుతుంది.

టాక్ షో 12వ ఎపిసోడ్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో షారుఖ్ భార్య గౌరీఖాన్.. భావన పాండే.. మహీప్ కపూర్ గెస్టులుగా వెళ్లారు. ఎప్ప‌టిలాగే క‌ర‌ణ్ త‌న‌దైన శైలిలో ప్ర‌శ్న‌లు సంధించారు. వాటికి ఆ త్ర‌యం అంతే ధీటుగా స‌మాధానాలిచ్చారు. మీకుమార్తెకి మీరు ఇచ్చే డేటింగ్ స‌ల‌హా ఏంట‌ని గౌరీఖాన్ ని క‌ర‌ణ్ అడ‌గ‌గా ..వెంట‌నే ఆమె `ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేయొద్దని సలహా ఇస్తాను` అని న‌వ్వేసారు.

షారుక్ తో మీరు ల‌వ్ స్టోరీ చేస్తే ఏలాంటి టైటిల్ పెడ‌తారు? అని ప్ర‌శ్నించ‌గా `దిల్ వాలే దుల్హ‌నియా లేజాయెంగే` అని చెప్పారు గౌరీఖాన్. అమ్మ‌లు త‌మ పిల్ల‌లు.. వారి రిలేష‌న్ షిప్స్ గురించి భ‌య‌ప‌డిన సంద‌ర్భాల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాలో హింట్ ఇస్తూ..గౌరీఖాన్ చేసిన బోల్డ్ కామెంట్స్ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ప్ర‌స్తుతం డేటింగ్ వ్యాఖ్య‌లు సామాజిక‌ మాధ్య‌మాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

పెళ్లికి ముందు డేటింగ్ నే త‌ప్పు. అలాంటిది గౌరీఖాన్ డేటింగ్ ఇద్ద‌రితో కాదు ఒకే సారి ఒక్క‌రితో మాత్ర‌మే చేయండిని కుమార్తెకి ఇచ్చిన స‌ల‌హా పై కొంద‌రు మండిప‌డుతున్నారు. కుమార్తెల‌కు ఇలాంటి స‌లహాలు ఏ త‌ల్లైనా ఇస్తుందా? అంటూ భ‌గ్గుమంటున్నారు. షారుక్ -గౌరీఖాన్ ల స్వీట్ డాట‌ర్ సుహానా ఖాన్ ది అర్చీస్ చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదే సినిమాతో ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీల కుమార్తెలు...మ‌న‌వ‌రాళ్లు తెరంగేట్రం చేస్తున్నారు. దీంతో అర్చీస్ ఎలా ఉంటుంది? అన్న ఉత్కంఠ మొద‌లైంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.