Begin typing your search above and press return to search.
'ఆర్‌ఆర్‌ఆర్' చివరి ఘటంకు ముహూర్తం ఫిక్స్
By: Tupaki Desk | 15 Jun 2021 7:30 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్ఆర్ సినిమా చివరి షెడ్యూల్ కోసం యూనిట్ సభ్యులతో పాటు అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ లో కీలకమైన రెండు పాటలతో పాటు ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. దాదాపుగా 8 నుండి 10 వారాల పాటు కంటిన్యూ షెడ్యూల్ తో సినిమాను ముగించాలని జక్కన్న వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లు నిలిచి పోయాయి.
ఆర్ఆర్‌ఆర్ షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. కరోనా కేసులు తగ్గడంతో పాటు ప్రభుత్వం నుండి కూడా లాక్ డౌన్ నిబంధనలు సడలింపు వచ్చింది. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్ లు పునః ప్రారంభం అయ్యాయి. కనుక ఆర్ ఆర్ ఆర్ ను కూడా కొద్ది మంది క్రౌడ్ తో షూటింగ్ ప్రారంభించాలని జక్కన్న నిర్ణయానికి వచ్చాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మొదలు పెట్టాడట. జులై మొదటి వారంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారని యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
ఇప్పటికే హీరోలు ఇద్దరితో పాటు సినిమాలో నటిస్తున్న కీలక నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు కూడా జులై మొదటి వారం నుండి షూటింగ్ కు హాజరు కావాల్సి ఉంటుందని సందేశం వెళ్లిందట. మొత్తానికి జక్కన్న చివరి ఘటంను ముగించేందుకు మరింత ఉత్సాహంతో రంగంలోకి దిగబోతున్నాడు. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ సినిమాలోని ఒక ఫైట్ కంటతడి పెట్టిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.