Begin typing your search above and press return to search.
లక్ష ఇస్తాం దేనికైనా ఒప్పుకోవాలన్నారు
By: Tupaki Desk | 5 July 2021 2:46 AM GMTఏ పరిశ్రమలో అయినా ఆడవారిపై లైంగిక వేదింపులు అనేవి జరుగుతున్నాయి. ఎన్నో రకాల చట్టాలు వచ్చినా మీడియాలో లైంగికంగా వేదించిన వారి గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు వచ్చినా కూడా కొందరు మాత్రం మారడం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఈ లైంగిక వేదింపులు ఏమీ తక్కువ కాదు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలను టార్గెట్ చేసి కొందరు లైంగికంగా వేదించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లైంగిక వేదింపుల కేసులు ఇండస్ట్రీలో నమోదు అవ్వడం చాలా తక్కువే కాని చాలా మంది అమ్మాయిలు వేదింపులు ఎదుర్కొంటున్నారు.. ఎదుర్కొన్నారు అనడంలో సందేహం లేదు.
లైంగిక వేదింపుల విషయాన్ని బయటకు చెప్తే ఆఫర్లు రావేమో అనే భయంతో చాలా మంది మౌనంగా ఉంటున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ విషయాలను చెబుతున్నారు. ఇటీవల చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా కనిపిస్తూ వస్తున్న శ్వేత వర్మ కాస్టింగ్ కౌచ్ మరియు లైంగిక వేదింపుల గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆఫర్ల కోసం తాను ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి యాడ్ లో నటించాలని అడిగాడు. అందుకు లక్ష రూపాయల పారితోషికం ఇస్తారని.. అయితే దర్శకుడు చెప్పినట్లుగా చేయాలంటూ కమిట్ మెంట్ అడిగాడు. నాకు వెంటనే అర్థం కాలేదు. కాస్త సమయం తర్వాత అతడి ఉద్దేశ్యం అర్థం అయ్యింది. వెంటనే అతడిపై కోపంతో అరిచాను. ఈ బిల్డింగ్ నుండి దూకు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాను.
షార్ట్ ఫిల్మ్ లు చేస్తున్న సమయంలో చాలా మంది నాతో అసభ్యంగా ప్రవర్తించేందుకు చూసేవారు. కొందరు కమిట్ మెంట్ అడిగితే కొందరు లైంగికంగా వేదించే వారు.. కొందరు మాటలతో ఇబ్బంది పెట్టే వారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్కటి రెండు సార్లు కాదు ఎన్నో సార్లు తాను కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొని ఆఫర్లు పోగొట్టుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో కొత్త వారికి ఒకప్పుడు తప్పలేదని.. కాని ఇప్పుడు మాత్రం కాస్త తక్కువగానే ఉందని అనిపిస్తుంది. మీటూ తో చాలా మార్పు వచ్చింది.