Begin typing your search above and press return to search.
ఒక్కో నెలకి ఒక్కొక్కళ్ళు ఫిక్సయ్యారు
By: Tupaki Desk | 30 Aug 2016 10:30 PM GMTటాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త సెంటిమెంట్స్ పుడుతూనే ఉంటాయి. వాటిపై నమ్మకం లేదంటూనే వాటినే ఫాలో అయిపోతుంటారు మూవీ మేకర్స్. స్టార్స్ అయినా.. హీరోలయినా వీటికి అతీతం కాదు. అలాంటిదే ఇప్పుడు సినిమా రిలీజ్ నెలల విషయంలో ఓ కొత్త సెంటిమెంట్ కనిపిస్తోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలను ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతున్నాడు. లేటెస్ట్ గా స్టార్ట్ అయిన దువ్వాడ జగన్నాథం కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ అవుతుందని టాక్. ఇందుకు కారణం.. రేసుగుర్రం.. సన్నాఫ్ సత్యమూర్తి.. సరైనోడు చిత్రాలు ఏప్రిల్ లో వచ్చి హిట్స్ కొట్టడమే. ఇక దర్శకుడు రాజమౌళి అయితే.. జూలై నెలను తనకు కలిసొచ్చేదిగా భావిస్తాడు. మగధీర.. ఈగ.. మర్యాద రామన్నలతో పాటు బాహుబలి కూడా జూలైలోనే వచ్చి సంచలనాలు సృష్టించాయి. నేచురల్ స్టార్ నాని అయితే.. సెప్టెంబర్ కి కమిట్ అవుతాడు. అష్టా చెమ్మా భలేభలే మగాడివోయ్ చిత్రాలు సెప్టెంబర్ నెలలోనే వచ్చాయి. ఇప్పుడు మజ్నుని కూడా వచ్చే నెలలోనే రిలీజ్ చేయనున్నాడు.
ఇక రామ్ చరణ్ అయితే.. అక్టోబర్ కి ఫిక్స్ అయిపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అందరూ హిట్స్ వచ్చిన నెలలకు ఫిక్స్ అయితే.. చెర్రీ మాత్రం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా అదే నెలలో వస్తానంటున్నాడు. గతంలో గోవిందుడు అందరివాడేలే.. బ్రూస్ లీ చిత్రాలు అక్టోబర్ లో వచ్చి ఫెయిల్ అయినా.. మళ్లీ ధృవను అక్టోబర్ లోనే విడుదల చేస్తుండడం విశేషం.