Begin typing your search above and press return to search.

`లాల్ సింగ్ చ‌డ్డా` పై ఇంగ్లాండ్ క్రికెట‌ర్ ఫైర్‌!

By:  Tupaki Desk   |   12 Aug 2022 1:44 PM GMT
`లాల్ సింగ్ చ‌డ్డా` పై ఇంగ్లాండ్ క్రికెట‌ర్ ఫైర్‌!
X
నాలుగేళ్ల విరామం త‌రువాత బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన మూవీ `లాల్ సింగ్ చ‌డ్డా`. `థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌` వంటి భారీ డిజాస్ట‌ర్ త‌రువాత అమీర్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో యావ‌త్ బాలీవుడ్ మొత్తం ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకుంది. గ‌త కొన్ని నెలలుగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న బాలీవుడ్ ని మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అయినా గ‌ట్టెక్కిస్తాడ‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూశారు. కానీ అంద‌రి అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ `లాల్ సింగ్ చ‌డ్డా` బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ గా నిలిచి తీవ్ర నిరాశ ప‌రిచింది.

ఈ మూవీ రిలీజ్ కు ముందు నుంచే వివాదాలు చుట్టుముట్ట‌డంతో వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. 2015లో అమీర్ ఖాన్ త‌న వైఫ్‌ దేశం విడిచి వెళ్లిపోదామ‌ని అడుగుతోంద‌ని, ఇక్క‌డ సేఫ్టీ లేదంటూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఓ వ‌ర్గం వారిని తీవ్రంగా ఆగ్ర‌హానికి గురి చేశాయి. దీంతో ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిలోనూ ఈ మూవీని బాయ్ కాట్ చేయండి అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టారు.

ఇదిలా వుంటే తాజాగా విడుద‌లైన ఈ మూవీపై ఇంగ్లాండ్‌ మాజీ క్రికెట‌ర్ మాంటీ ప‌నేస‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమీర్ ఖాన్ సినిమా ఇండియ‌న్ ఆర్మీని, సిక్కుల‌ను దారుణంగా అవ‌మానించింద‌ని మండిప‌డ్డారు. ఆయ‌న సోష‌ల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. `ఫారెస్ట్ గంప్‌` యుఎస్ ఆర్మీకి ఓకే కానీ ఇండియ‌న్ ఆర్మీకి మాత్రం ఓకే కాద‌న్నాడు. వియ‌త్నాం యుద్ధం కోసం అమెరికా అతి త‌క్కువ ఐక్యూ (బుద్ధి మాంధ్యం) వున్న వారిని రిక్రూట్ చేసుకుంది.

అయితే ఈ విష‌యంలో `లాల్ సింగ్ చ‌డ్డా` మాత్రం భార‌త సాయుధుల‌ని, సిక్కుల‌ను అవ‌మానించింద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా #BoycottLalSinghChadda అంటూ అమీర్ ఖాన్‌ ఫొటోని షేర్ చేయ‌డం ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇక మ‌రో ట్వీట్ లో `లాల్ సింగ్ చ‌డ్డా` లో అమీర్ ఖాన్ చిన్నారుల మ‌న‌స్త‌త్వం వున్న వాడిలా న‌టించాడ‌ని, కానీ `ఫారెస్ట్ గంప్` స్వ‌త‌హాగా అలాంటి మ‌న‌స్థ‌త్వం గ‌ల‌వాడన్నారు. అంతే కాకుండా మ‌రో ట్వీట్ ని కూడా షేర్ చేశారు.

ఇందులో ఒక ప‌ద్మ‌విభూష‌ణ్‌, ఒక ప‌ద్మ‌భూష‌ణ్‌, 21 ఇండియ‌న్ ఆర్డ‌ర్ ఆఫ్ మెరిట్స్‌, 14 విక్టోరియా క్రాస్ లు, రెండు ప‌ర‌మ్ వీర‌చ‌క్ర‌లు, 4 అశోక చ‌క్ర‌లు, 8 మ‌హావీర్ చ‌క్ర‌లు, 24 కీర్తి చ‌క్ర‌లు, 64 వీర్ చ‌క్ర‌లు, 55 శౌర్య చ‌క్ర‌లు, 375 సేనా మెడ‌ల్స్`అంటూ మూడ‌వ ట్వీట్ లో పేర్కొంటూ #BoycottLalSinghChadda హ్యాష్ ట్యాగ్ ని షేర్ చేశారు. ఇదిలా వుంటే వివాదాల సుడిగుండంలో వున్న `లాల్ సింగ్ చ‌డ్డా` కు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల నుంచి కూడా దాదాపు ఇదే త‌ర‌హా షాక్ త‌గిలింది. 15 నుంచి 20 శాతానికి మించి థియేట‌ర్ల‌లో ఆక్యుపెన్సీ లేక‌పోవ‌డం విచార‌క‌రం.