Begin typing your search above and press return to search.

వైజయంతి రేంజ్ ఏంటో చూపించారు

By:  Tupaki Desk   |   2 May 2018 10:13 PM IST
వైజయంతి రేంజ్ ఏంటో చూపించారు
X
ఓ సినిమాను రియల్ లొకేషన్స్ లో తీయడం వేరు.. ఆ సినిమా కోసం రియాలిటీని తలపించే సెట్స్ వేయడం వేరు. కానీ ఊహా లోకాలను సెట్స్ రూపంలో సాధ్యం చేయడం మాత్రం క్లిష్టమైన విషయం. ఇందుకు మేథోశక్తితో పాటు.. అంతకు మించిన ఆర్థిక శక్తి అత్యంత అవసరం. సినిమా విషయంలో ఇలా సెట్స్ కోసం భారీగా వెచ్చించడం అంటే.. వైజయంతీ మూవీస్ తర్వాతే ఏ బ్యానర్ అయినా నిలుస్తుంది.

అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి స్టార్ట్ చేస్తే.. దాదాపు అన్ని సినిమాల్లోనూ భారీ సెట్స్ కోసం బోలెడంత వెచ్చించడం ఈ బ్యానర్ ఆనవాయితీ. ఇప్పుడు మహానటి చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్ పై రూపొందించినా.. వైజయంతీ మూవీస్ సమర్పణ అసలు సిసలైన ఆకర్షణ. తాజాగా ఈ చిత్రం నుంచి 'మూగ మనసులు' అంటే సాగే ఓ పాటకు ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమో చూసిన ఎవరైనా మైమరచిపోవాల్సిందే.

తెల్లని రంగు థీమ్ తో రూపొందిచిన ఈ సెట్.. అందులోనూ దుల్కర్ సల్మాన్- కీర్తి సురేష్ లతో సహా అందరూ వైట్ డ్రెస్ లోనే ఉన్న ఆర్టిస్టులు.. విజువల్ గా అద్భుతం అనాల్సిందే. ఇది ఓ ఫిమేల్ లీడ్ మూవీ అని తెలిసినా.. కంటెంట్ కోసం అంతేసి వెచ్చించి భారీ సెట్స్ వేయడం అంటే.. ఒక్క వైజయంతి బ్యానర్ కే సాధ్యం అని మరోసారి ప్రూవ్ చేశారు అశ్వినీదత్. ఆయన వారసత్వాన్ని అచ్చంగా అందిపుచ్చుకున్న కూతుళఅలు కూడా అదే ట్రెండ్ ను ఫాలో అవుతుండడం విశేషం.

వీడియో కోసం క్లిక్ చేయండి