Begin typing your search above and press return to search.
థియేటర్లు అన్ లాక్ చేసినా ఓటీటీలోనే అమ్మన్
By: Tupaki Desk | 7 Oct 2020 12:30 AM GMTకరోనా లాక్ డౌన్ కారణంగా ఏడు నెలలుగా థియేటర్లలో బొమ్మ పడలేదు. ఎట్టకేలకు పరిస్థితులు కుదుట పడుతుండటంతో పాటు కరోనాపై జనాల్లో అవగాణహ వచ్చిన కారణంగా థియేటర్ల అన్ లాక్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని మార్గదర్శకాలను ఇచ్చి సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అంది. మార్గదర్శకాల్లో ప్రధానంగా థియేటర్లు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే కొనసాగాలి. సినిమా థియేటర్లు మరియు మల్టీప్లెక్సులు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగితే ఖర్చులు రావడం అనుమానమే అంటున్నారు. టికెట్ల రేట్లను పరిగణలోకి తీసుకుని లెక్క చేస్తే మిగిలేది చాలా తక్కువ అంటున్నారు. అందువల్ల పెద్ద సినిమాలు ఈ కండీషన్స్ మద్య తమ సినిమాలను విడుదల చేయాలనుకోవడం లేదు.
తాజాగా నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్' సినిమాను ప్రముఖ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను మే 1వ తారీకున విడుదల చేయాలని భావించారు. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల అవ్వలేదు. అప్పటి నుండి ఓటీటీ ఆఫర్లు వస్తున్నప్పటికి థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే మరో నాలుగు అయిదు నెలల వరకు థియేటర్లు ఓపెన్ అయినా జనాలు వచ్చేది లేనిది క్లారిటీ లేదు. అందుకే రిస్క్ తీసుకోకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా నయన్ మూకుత్తి అమ్మన్ ను తమిళంతో పాటు పలు భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారట. థియేటర్ల అన్ లాక్ తర్వాత పెద్ద సినిమా మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల తమిళ సినీ వర్గాల వారు మరియు థియేటర్ల యాజమాన్యాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమ్మన్ దారిలో మరెంత మంది వెళ్తారు అనేది చూడాలి.