Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ఫ్లేవర్ తగ్గించు సాహో
By: Tupaki Desk | 10 July 2019 5:11 AM GMTఅనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి తరహాలో ఉంది సాహో వ్యవహారం. రెండు వందల కోట్ల బడ్జెట్ తో తీసిన తెలుగు సినిమాగా ఉండాల్సిన రేంజ్ లో దీని మీద హైప్ లేని మాట వాస్తవం. టీజర్ రిలీజ్ చేశారు. అద్భుతః అనకపోయినా అదిరింది అనే ఫీడ్ బ్యాక్ అయితే వచ్చింది. ఏదో సైకో సయ్యా అని ఆడియో సింగల్ ని వీడియోతో సహా విడుదల చేశారు. ఇప్పటికీ అది హిందీ పాటా తెలుగు సాంగా అర్థం కాక ఫాన్సే రిపీట్ మోడ్ లో వింటున్నారు. ఇక సామాన్య ప్రేక్షకులు ఒక్కసారికే పెదవి విరిచారు.
ఇదంతా సాహోకు ప్లస్ అయ్యే అంశం కాదు. చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎంత యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయినా అంతమంది బాలీవుడ్ యాక్టర్స్ ని ఎందుకు తీసుకున్నారన్న కామెంట్స్ ముందు నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. టీజర్ లో సైతం వెన్నెల కిషోర్ లాంటి ఒకరిద్దరిని మినహాయిస్తే మొత్తం బాలీవుడ్ బ్యాచే సినిమా మొత్తం నిండిపోయింది. బాహుబలికి రాజమౌళి ఈ ఫార్ములా ఫాలో కాలేదు. కేవలం తెలుగు తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని క్యాస్టింగ్ సెట్ చేసుకున్నాడు తప్ప పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అనవరసంగా హిందీ తారల వెంట పడలేదు. కానీ సాహోకు జరుగుతున్నది వేరు. తీస్తోందే హిందీ మూవీ అనే ఫీలింగ్ కలుగుతోంది.
ఇదంతా పోవాలంటే అర్జెంటు గా సాహో ప్రమోషన్ స్ట్రాటజీ మార్చాలి. రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు కదా అనే సానుభూతితో జనం సినిమాకు రారు. ఫైనల్ గా కంటెంటే ముఖ్యం. అది లేకుండా వెయ్యి కోట్లు పెట్టినా లాభం ఉండదు. అందుకే సాహో రెండేళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలి అంటే సౌత్ లో అందులోనూ తెలుగు ప్రేక్షకులకు ఇది మన సినిమానే అనే ఫీలింగ్ ఇంకా బలంగా కలిగేలా రూటు మార్చాలి. కేవలం నెల రోజులే చేతిలో ఉన్న నేపథ్యంలో అభిమానుల టెన్షన్ అంతకంతకు పెరిగిపోతోంది.