Begin typing your search above and press return to search.
హిందీ 'పుష్ప' విషయంలో మరింత స్పష్టత
By: Tupaki Desk | 3 Nov 2021 5:39 AM GMTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ మొదలు పెట్టక ముందు నుండే తెలుగు తో పాటు హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడంలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటిస్తూ వచ్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ అయిదు భాషల్లో విడుదల చేయడంతో పాటు పాటలను కూడా అయిదు భాషల్లో విడుదల చేయడం జరిగింది. ఈ సమయంలో పుష్ప హిందీ వర్షన్ విడుదల లేదంటూ మీడియాలో పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది. పుష్ప కు సంబంధించినంత వరకు అధికారికంగా హిందీ వర్షన్ రిలీజ్ క్యాన్సిల్ విషయం చెప్పకున్నా కూడా కొందరు సోషల్ మీడియా లో పుకార్లను ప్రచారం చేయడం జరిగింది. హిందీలో భారీ ఎత్తున విడుదల అవుతుందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా విడుదల లేదంటూ వచ్చిన వార్తలు బన్నీ హిందీ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. పాన్ ఇండియా రేంజ్ లో బన్నీ సినిమా ను విడుదల చేస్తారని ఆశించిన అభిమానులు కూడా కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. కాని హిందీ రిలీజ్ విషయంలో స్పష్టత వచ్చేసింది.
పుష్ప సినిమా హిందీలో విడుదల చేయడం కోసం ప్రముఖ బయ్యర్లు ముందుకు రాలేదని.. అందువల్ల స్వయంగా అల్లు అరవింద్ అక్కడ తనకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ మరియు పరిచయాల ద్వారా విడుదల చేసేందుకు సిద్దం అయ్యారంటూ మెగా కాంపౌండ్ నుండి మనకు సమాచారం అందుతోంది. అల్లు అరవింద్ ఇప్పటికే హిందీలో సినిమాలు నిర్మించిన విషయం తెల్సిందే. ఆ పరిచయాలు మరియు ఆ అనుభవంతో పుష్ప ను హిందీ లో అల్లు వారే స్వయంగా విడుదల చేసేందుకు రంగంలోకి దిగారనే వార్తలు వస్తున్నాయి. ఈమద్య కాలంలో హిందీలో సినిమా లు విడుదల అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇతర భాషల సినిమా లు పోటీకి వస్తే తమ భాష సినిమాల పరిస్థితి ఏంటీ అన్నట్లుగా కొందరు హిందీ ఫిల్మ్ మేకర్స్ పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు అడ్డుకున్నా కొందరు మాత్రం పుష్పకు సపోర్ట్ గా నిలుస్తున్నట్లుగా తెలుస్తోంది. వారి సాయంతో అల్లు అరవింద్ ఉత్తరాదిన భారీ ఎత్తున పుష్ప సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
సుకుమార్ మరియు అల్లు అర్జున్ ల గత చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. పైగా పుష్ప సినిమా షూటింగ్ మొదలు పెట్టక ముందు నుండే భారీ అంచనాలు మోస్తుంది. అంచనాలకు ఏమాత్రం తగ్గేదే లే అంటూ సుకుమార్ పుష్ప ను అద్బుతంగా తీర్చి దిద్దాడు. బన్నీ లుక్ మరియు హీరోయిన్ రష్మిక మందన్నా లుక్ ఇతర సన్నివేశాలకు సంబంధించిన ప్రోమోలు.. గ్లిమ్స్ పాటలు ఇలా అన్ని కూడా సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచేలా చేస్తున్నాయి. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేస్తుందని పుష్ప పై అంతా నమ్మకంగా ఉన్నారు. పుష్ప ఖచ్చితంగా కేజీఎఫ్ రికార్డును బ్రేక్ చేసి పరువు నిలపాలని మెగా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. పుష్ప ను రెండు పార్ట్ లుగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్ ను వచ్చే నెల లో విడుదల చేయబోతున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తి చేసిన సుకుమార్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఒకటి రెండు రోజుల ప్యాచ్ వర్క్ షూట్ లో బన్నీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈనెల చివరి నుండే పాన్ ఇండియా రేంజ్ లో ప్రచారం ను మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 17 న ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయడం పక్కా అని తేలిపోయింది.