Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు షాకిచ్చేలా ఉంటాయట
By: Tupaki Desk | 24 July 2017 4:03 AM GMTతెలుగు రాష్ట్రాల్ని ఊపేస్తున్న డ్రగ్స్ కేసు విచారణ అంశంలో వినిపిస్తున్న సరికొత్త కథనాలు సంచలనంగా మారుతున్నాయి. అధికారిక సమాచారం ఏమీ బయటకు రాకున్నా.. విశ్వసనీయ వర్గాల పేరిట వినిపిస్తున్న కొత్త పేర్లు ఇప్పుడు మరింత షాక్‌కు గురి చేసేలా ఉన్నాయని చెబుతున్నారు. డ్రగ్స్ తో లింకులు ఉన్నట్లుగా గతంలో పలుమార్లు టాలీవుడ్‌కు సంబంధించిన వారి పేర్లు బయటకు పొక్కినా.. విచారణ వరకూ వచ్చింది లేదు.
తాజాగా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. డ్రగ్స్ విచారణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. ఎలాంటి ఒత్తిడికి తలొగ్గొద్దంటూ ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది.ఈ కారణంగానే తొలుత పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా అదుపులోకి తీసుకున్న డ్రగ్స్ నిందితులతో పాటు.. టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు చెప్పిన వివరాల నేపథ్యంలో కొత్తగా మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి వేళలో.. పోలీసులు తదుపరి నోటీసులు ఇచ్చే వారికి సంబంధించి పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నిజానిజాల మాట పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
తాజాగా వినిపిస్తున్న పేర్లు వింటే ఒక్కసారి షాక్ తినాల్సిందే. ఎందుకంటే.. తొలి జాబితాలో నోటీసులు అందుకున్న టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఎవరూ కూడా అగ్ర తారలు లేరని చెప్పాలి. కానీ.. తాజాగా వినిపిస్తున్న వాదనల ప్రకారం.. రెండో జాబితాలో పలువురు స్టార్లు.. ప్రస్తుతం కెరీర్ లో పీక్స్ లో ఉన్న వారు కూడా ఉన్నట్లుగా చెప్పటం సంచలనంగా మారింది. దీనికి సాక్ష్యాలు.. ఆధారాలు ఏమిటంటే.. ఏమీ లేవనే మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు సోర్స్ చెప్పమంటే చెప్పలేం కానీ.. కాస్త వెయిట్ చేస్తే మాత్రం తాము చెప్పిన వారికి అధికారులు నోటీసులు ఇవ్వటం మాత్రం ఖాయమన్న మాట చెప్పటం కనిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న పేర్లకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఒక టాలీవుడ్ ప్రముఖుడి వారసుడన్న మాటను చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాజాగా వినిపిస్తున్న నలుగురు ప్రముఖుల్లో ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులకు సంబంధించిన సంతానమేనని చెబుతున్నారు.
వీరిలో ఇద్దరు నటులు.. ఇద్దరు నటీమణులు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్న మాటను స్పష్టంగా చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ.. పోలీసు వర్గాలతో పాటు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న ఆ నలుగురిలో ఇద్దరు వంద కోట్ల మార్క్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసిన నటులుగా చెబుతున్నారు. ఇక.. హాట్ హాట్ నటి కూడా ఉందంటున్నారు. ఇక.. నాలుగో వ్యక్తికి సంబంధించి చూస్తే.. ఒక ప్రముఖుడి సంతానంగా చెబుతున్నారు. తమకు తాను పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకొని.. తనదైన ఇమేజ్ సొంతం చేసుకున్న నలుగురికి తప్పనిసరిగా నోటీసులు అందటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అదే నిజమైతే.. డ్రగ్స్ విచారణ మరో సంచలనం నమోదు కావటం ఖాయమని చెప్పక తప్పదు.