Begin typing your search above and press return to search.

అన్ క‌ట్ వెర్ష‌న్ ఆఫ్ సీబీఎన్ లో మ‌రిన్ని సీక్రెట్ లా?

By:  Tupaki Desk   |   27 Oct 2022 7:50 AM GMT
అన్ క‌ట్ వెర్ష‌న్ ఆఫ్ సీబీఎన్ లో మ‌రిన్ని సీక్రెట్ లా?
X
సీనియ‌ర్ స్టార్ నంద‌మూరి బాల‌కృష్ణ‌ తొలిసారి 'ఆహా' ఓటీటీ కోసం'అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె' అంటూ టాక్ షోతో దుమ్ము దులిపేసిన విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ సీజ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డమే కాకుండా ఐఎండీబీ సైట్ లో మోస్ట్ పాపుల‌ర్ టాక్ షోగా రికార్డు స్థాయి రేటింగ్ ని సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో సీజ‌న్ 2పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు అనుగుణంగానే సీజ‌న్ 2ని 'ఆహా' ఓటీటీ ఎట్ట‌కేల‌కు మొద‌లు పెట్టింది. మాజీ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ తో మొద‌లు పెట్టారు.

సీజ‌న్ 2 లోని ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబ‌ర్ 14న 'ఆహా'లో స్ట్రీమింగ్ మొద‌లైంది. గ‌త సీజ‌న్ ఫ‌స్ట్ ఎపిసోడ్ ని క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుతో మొద‌లు పెట్టిన బాల‌య్య సీజ‌న్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ని నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ లో స్టార్ట్ చేయ‌డంతో వీక్ష‌కుల్లో మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే వివాదాస్ప‌ద అంశాల‌పై నారా చంద్ర బాబు నాయుడు స్పందించ‌డం.. బాల‌య్య ప‌లు ప్ర‌శ్న‌లు వేయ‌డం తెలిసిందే.

బావా మ‌రుదుల హంగామా గా సాగిన తాజా సీజ‌న్ ఫ‌స్ట్ ఎపిసోడ్ ఇప్ప‌టికీ ట్రెండ్ అవుతూనే వుంది. ఎన్టీఆర్ ని గ‌ద్దెదింప‌డం ద‌గ్గ‌రి నుంచి ల‌క్ష్మీ పార్వ‌తి విష‌యంలో తాము వ్య‌వ‌హ‌రించిన తీరుపై నారా చంద్ర‌బాబు నాయుడు క్లారిటీ ఇవ్వ‌డం, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో త‌న స్నేహం, యుక్త వ‌య‌సులో చేసిన చిలిపి అల్ల‌రి ప‌నుల గురించి బ‌య‌ట‌పెట్టిన తీరు వీఓకుల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

అయితే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన అన్ క‌ట్ వెర్ష‌న్ కూడా వుంద‌ట‌. ఇందులో బాబు, బాల‌య్య కు ఎలాంటి విష‌యాల్ని వెల్ల‌డించారో.. బాల‌య్య ఏ విష‌యాల‌పై బాబుని ప్ర‌శ్నించారో.. ఈ అన్ క‌ట్ వెర్ష‌న్ లో చూపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఈ అన్ క‌ట్ వెర్ష‌న్ కి సంబంధించిన వీడియో గురువారం అర్థ్ర రాత్రి 12 గంట‌ల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంద‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా 'ఆహా' ఓటీటీ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా ప్ర‌క‌టించారు.

మోర్ ఫ‌న్.. అండ్ మోర్ సీక్రెట్స్ ..అన్ సెన్సార్డ్ అండ్ ఎక్స్ టెండెడ్ వెర్ష‌న్ ని గురువారం రాత్రి 12 గంట‌ల‌కు స్ట్రీమింగ్ చేయ‌బోతున్నాం' అంటూ ప్ర‌క‌టించారు. దీనితో పాటు ఎక్సైటింగ్ థ‌ర్డ్ ఎపిసోడ్ త్వ‌ర‌లో రాబోతోంది' అంటూ స్ప‌ష్టం చేశారు. మ‌రి బాల‌య్య‌తో బాబు చెప్పిన ఆ సీక్రెట్ లేంటో తెలియాలంటే గురువారం రాత్రి 'ఆహా'లో స్ట్రీమింగ్ అయ్యే అన్ క‌ట్ వెర్ష‌న్ ఆఫ్ సీబీఎన్ చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.