Begin typing your search above and press return to search.
హీరో ముందు ముందు మరిన్ని విలన్ రోల్స్
By: Tupaki Desk | 3 Oct 2020 8:10 AM GMTతమిళ సీనియర్ స్టార్ హీరో మాధవన్ తాజాగా అనుష్కతో కలిసి నిశబ్దం సినిమాలో నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన 'నిశబ్దం' సినిమా నిన్న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మాధవన్ హీరో అంటూ మొదటి నుండి ప్రచారం జరిగింది. అనుష్క మాధవన్ జంటగా అంటూ వార్తలు వచ్చాయి. కాని సినిమా చూసిన తర్వాత అంతా కూడా షాక్ అవుతారు. సినిమా ట్విస్ట్ అదిరింది. అతడు నెగటివ్ షేడ్స్ లో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకు ముందు సవ్యసాచి మూవీలో కూడా మాధవన్ విలన్ గా నటించాడు. సవ్యసాచి మరియు నిశబ్దం సినిమాలు ఓవరాల్ ఫలితం పక్కకు పెడితే అందులో మాధవన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
నిశబ్దం ప్రమోషన్ లో భాగంగా మాధవన్ ఇంకా ఇతర చిత్ర యూనిట్ సభ్యులు సుమతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా మాధవన్ మాట్లాడుతూ నెగటివ్ రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం. ఆ పాత్రలు ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి. విలన్ పాత్రలు చేసేందుకు నేనెప్పుడు సిద్దంగానే ఉంటానన్నాడు. ముందు ముందు మరిన్ని విలన్ రోల్స్ ను చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా మాధవన్ చెప్పుకొచ్చాడు. తెలుగులో మాధవన్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో నటించాడు. నిశబ్దం ఫలితం నేపథ్యంలో ముందు ముందు ఆయనకు ఎలాంటి పాత్రలను మేకర్స్ ఆఫర్ చేస్తారనేది చూడాలి.