Begin typing your search above and press return to search.

ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ మూవీస్‌

By:  Tupaki Desk   |   5 Jan 2016 10:30 PM GMT
ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ మూవీస్‌
X
2016లో భారీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇవ‌న్నీ ఎంతో క్రేజుతో వ‌స్తున్న‌వి. ర‌జ‌నీ కాంత్ న‌టిస్తున్న‌ క‌బాలి - 2.0 - రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బాహుబ‌లి -2 - ప‌వ‌న్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌ సింగ్‌ - మ‌హేష్ - బ్ర‌హ్మోత్స‌వం, సూర్య హీరోగా న‌టిస్తున్న 24 - విజ‌య్ 59వ సినిమా తేరీ .. ఇవ‌న్నీ ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ మూవీస్‌.

ఇప్ప‌టికే ర‌జ‌నీ డాన్ క్యారెక్ట‌ర్‌ లో న‌టిస్తున్న క‌బాలీ పై భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రాన్ని మ‌లేషియాలో మెజారిటీ భాగం తెర‌కెక్కిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ క‌బాలీశ్వ‌రుడు అనే డాన్ క్యారెక్ట‌ర్ లో న‌టిస్తున్నారు. ఇది ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ ఫిలిం. రంజిత్‌.పి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీ క‌థానాయ‌కుడిగా 2.0 ఇటీవ‌లే మొద‌లైంది. 400 కోట్ల బ‌డ్జెట్‌ తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అక్ష‌య్ కుమార్ ఇందులో విల‌న్ గా న‌టిస్తుండడం విశేషం. ఈ ఏడాది చివ‌రి నాటికి రిలీజ‌వుతుంద‌న్న అంచ‌నాలున్నాయ్‌.

అలాగే ఇదే ఏడాదిలో వ‌స్తుంద‌ని భావిస్తున్న బాహుబ‌లి -2 మ‌రోసారి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌భాస్‌ - రానా - అనుష్క కీల‌క‌పాత్ర‌ల్లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా మోస్ట్ అవైటింగ్ ఫిలిం. దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చు చేస్తున్నారు. ఇక ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సుదీర్ఘ గ్యాప్ త‌ర్వాత న‌టిస్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ మోస్ట్ అవైటింగ్ వ‌న్‌. ఈ మూవీకి బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాప్ స్టోరీ అయినా ప‌వ‌న్ శైలి విన్యాసాలు మెరిపిస్తాయ‌ని అభిమానులు భావిస్తున్నారు. ఏప్రిల్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇక మ‌హేష్ హీరోగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో పీవిపి నిర్మిస్తున్న బ్ర‌హ్మోత్స‌వం చ‌క్క‌ని కుటుంబ క‌థ‌తో తెర‌కెక్కుతోంది. శ్రీ‌మంతుడు వంటి క్లాసిక్ హిట్ త‌ర్వాత ప్రిన్స్ ఎంతో కాన్ఫిడెంటుగా చేస్తున్న ఫిలిం ఇది. 2016 మోస్ట్ అవైటింగ్ ఫిలింగా పేరు తెచ్చుకుంది. విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తేరీ అంతే పాపుల‌ర్ అయ్యాయి. ఈ ఏడాది వ‌స్తున్న మోస్ట్ పాపుల‌ర్ మూవీస్ జాబితాలో చోటు ద‌క్కించుకున్నాయి. వీటిలో ఏది ఎలాంటి రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.