Begin typing your search above and press return to search.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న క్రేజీ మూవీస్ ఇవే...!

By:  Tupaki Desk   |   14 Jun 2020 7:50 AM
ఓటీటీలో రిలీజ్ కాబోతున్న క్రేజీ మూవీస్ ఇవే...!
X
దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినిమా థియేటర్స్ అండ్ మల్టీప్లెక్సెస్ పరిస్థితి డేంజర్ జోన్ లో పడిపోయింది. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులిస్తున్నప్పటికీ థియేటర్స్ రీ ఓపెనింగ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారనే విషయం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు ఊహించని రీతిలో నమోదవుతున్నాయి. దీంతో థియేటర్స్ ఓపెన్ చేసినా ఒకప్పటిలా ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూసే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలకి ఓటీటీ ఒక్కటే మార్గంగా కనబడుతోంది. నిన్న మొన్నటి వరకు లేట్ అయినా థియేటర్లలోనే మా సినిమా విడుదల చేస్తాం అని చెప్పిన ప్రొడ్యూసర్స్ కి ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ మాత్రమే ఆప్షనల్ గా మారిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తెలుగులో 'అమృతరామన్' అనే సినిమా డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ అయిన తెలుగు చిత్రంగా నిలిచిపోయింది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’.. అమితాబ్ బచ్చన్ - ఆయుష్మాన్‌ ఖురానా కలిసి నటించిన 'గులాబో సితాబో' కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.

ఇక 'మహానటి' కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘పెంగ్విన్’ చిత్రాన్ని కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్నారు. అంతేకాకుండా విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శ‌కుంతల దేవి'.. అలాగే కన్నడ 'లా' మరియు 'ఫ్రెంచ్ బిర్యానీ'.. మలయాళ 'సూపియుమ్ సుజాతయుమ్'.. తెలుగు '47 డేస్' సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. దీంతో దాదాపుగా అన్ని ఇండస్ట్రీస్ ఓటీటీ రిలీజులకు మొగ్గుచూపుతున్నట్లు అర్థం అవుతోంది. అయితే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మార్పులకు తెరలేపే బాలీవుడ్ లో చాలా సినిమాలు ఓటీటీల వైపు అడుగులు వేస్తున్నాయి. హిందీ సినిమా 'గులాబో సితాబో' సినిమా ఓటీటీలో రిలీజైన మొదటి క్రేజీ మూవీగా నిలిచింది. ఈ సినిమా మంచి రివ్యూస్ సాధించి విశేష ఆదరణ పొందింది. దీంతో హిందీలో ఇప్పటికే పూర్తయిన చాలా సినిమాలు ఓటీటీ రిలీజ్ కి సిద్దపడ్డాయి. ఈ మూవీస్ అన్నీ స్టార్ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో నిర్మించిన క్రేజీ మూవీస్ కావడం విశేషం.

లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ - కియారా అద్వానీ కాంబినేషన్ లో తెరకెక్కిన 'లక్ష్మీబాంబ్'. 'కాంచన' సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు అజయ్ దేవగన్ - ప్రణీత కలిసి నటించిన ''భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'' సినిమా కూడా ఓటీటీలో విడుదల కాబోతోందట. అంతేకాకుండా మహేష్ భట్ 'సడక్ 2'.. అభిషేక్ బచ్చన్ ''ది బిగ్ బుల్''.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ''దిల్ బచేరా''.. కృతి సనన్ 'మిమి' సినిమా.. సన్నీ కౌశల్ 'లూట్ కేస్' సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ కి రెడీగా ఉన్నాయట. వీటి రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం.