Begin typing your search above and press return to search.
రివైండ్ 2015: కొన్ని టపాసులు పేలలేదు..
By: Tupaki Desk | 30 Dec 2015 5:30 PM GMTమొత్తం ఈ ఏడాది అంతా కలిపి దాదాపుగా నేరుగా తెరకేక్కినవి, అనువాదాలు కలుపుకుని 210 పైగానే చిత్రాలు విడుదలయ్యి వీక్లీ యావరేజ్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాయి. అయితే వీటిలో 60 శాతం చిన్న సినిమాలే కావడం వలన వాటిపై పెద్దగా దృష్టిపెట్టకపోవచ్చు. మిగిలిన 40శాతంలో భారీ అంచనాల మధ్య విడుదలై రిజల్ట్ తలకిందులైన సినిమాల కధా వివరాలు టాప్లో నుంచి చెప్పుకుందామా?
ఓ రకంగా కిల్ చేసిన అఖిల్ :
అక్కినేని మూడవ తరం నటవారసుడిగా, డైనమిక్ లుక్స్ తోషార్ప్ ఫీచర్స్ తో మనం లో కనిపించిన కొద్ది సేకన్లకే అలరించిన అఖిల్ తొలి చిత్రం ఎలా వుంటుందని అందరూ ఎదురుచూశారు. వినాయక్ దర్శకత్వం, బాలీవుడ్ దిగుమతులు జతకలవడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే సినిమా విడుదలయ్యాక మాత్రం రిజల్ట్ తారుమారయింది. ప్రొడ్యూసర్ లకు, బయ్యర్లకు ఈ సినిమా నష్టాన్ని మిగిల్చింది.
అఖిల్ ఆకట్టుకోలేకపోవడానికి కారణాలు:
* భారీ అంచనాలు మధ్య విడుదలై నాసిరకం స్టోరీతో, పరిణితి చెందని గ్రాఫిక్స్ తో సినిమాను చుట్టేయడం.
* హీరోయిన్ మొఖంలో అందం, అభినయం కరువవడం.
* ఆశించిన మేరకు అఖిల్ స్క్రీన్ ప్రజెన్స్ లేకపోవడం.
బ్రూస్ లీ.. కాస్త సిల్లీ:
రామ్ చరణ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అంటే ప్రేక్షకులకు అదోరకమైన భరోసా. ఎవడు, రచ్చ,నాయక్ ఇలా స్టోరీ లేని సినిమాలను సైతం కోట్ల క్లబ్బులో నిలబెట్టగలిగే స్టామినా తనది. అలాంటి చెర్రి శ్రీను వైట్ల, కోనా లను కలపడం, స్టోరీ తయారుచేయించడం, దానికి చిరు చాన్నాళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇచ్చి చిన్న సీన్ లో నటించడం ఇలా బ్రూస్ లీ సినిమా విడుదలకు ముందు గాలులు అనుకూలంగానే వీచాయి. అయితే సినిమా విడుదలయ్యాక మాత్రం తుఫాను తాకిడికి నిలబడలేని చెట్టులా బాక్స్ ఆఫీస్ వద్ద కుప్పకూలిపోయింది
బ్రూస్ లీ .. మళ్ళి మళ్లి చూడలకపోవడానికి రీజన్స్ :
* వైట్ల , కోనా అదే పాత నాసిరకం టెంప్లేట్ ని ఫాలో అవ్వడం.
* అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడం.
* మెగా స్టార్ రాక నామమాత్రంగానే నిలవడం.
బ్యాక్ స్టెప్ వేసిన రెండో కిక్..
సురేందర్ రెడ్డి, రవితేజ ల కాంబినేషన్ లో వచ్చిన సంచలనం కిక్ కి సీక్వెల్ స్టార్ట్ చెయ్యగానే మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశించినవారందరికీ ఈ ద్వయం గట్టిగానే నిరాశకలిపించింది. కంఫర్ట్ ప్రధానాంశంగా నడిచిన కిక్ 2 సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది..
కిక్ 2 .. వీక్ గా ఎందుకు నిలిచిందంటే:
* మొదటి భాగంలో వుండే ఫ్రెష్ నెస్, క్రియేటివిటీ రెండో దాన్లో లేకపోవడం
* ఈ కధకు తాము రాసుకున్న సబ్జెక్ట్ లైన్ కి పొంతన లేకపోవడం.
* రవితేజ మరీ బక్కపల్చగా కనిపించడం.
అసౌకర్యం కలిగించిన సౌఖ్యం:
లౌక్యం సినిమా విజయంతో దూసుకుపోతున్న గోపీచంద్ వేగాన్ని సౌఖ్యం సినిమా కట్టడి చేసింది. రొటీన్ మసాలా కధలను మన తెలుగువాళ్ళు పలుమార్లు తిప్పికొట్టినా గోపీ మరోసారి అదే ఫార్మ్లులతో రావడం గమనార్హం. అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ నష్టాలని చవిచూసింది.
సౌఖ్యం .. పేరుకు తగ్గట్టుగా ఎందుకు పనిచేయలేదంటే:
* ఒకే రకం ఇమేజ్ కి, స్టోరీ లైన్ కి దర్శకుడు, హీరో పరిమితం అయిపోవడం.
* కధలో కొత్త దానం బియ్యపు కొనంతైనా లేకపోవం.
ఐ... ఐపోయింది:
తెలుగు సినిమా పెద్ద దర్శకులకు సమానంగా మార్కెట్ ని సంపాదించుకున్న శంకర్ నుండి సినిమా అనగానే కళ్ళు పెద్దవవుతాయి. దానిలో విక్రం హీరో అనగానే చెవులు రెక్కిస్తాయి. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన 'ఐ' సినిమా అత్యంత నిరాశ పరిచింది.
ఐ.. మైమరిపించలేకపవాడానికి రీజన్స్:
* సదరు శంకర్ సినిమాలలో కనిపించే కొత్తదనం, ఫ్రెష్ నెస్, క్రియేటివిటీ లోపించడం.
* జిగుప్త్సాకరంగా మారిన మేక్ అప్.
* పట్టుసదలిన స్టోరీ లైన్.
ఈ సినిమాలే కాక బాలయ్య బాబు లయన్ - సంపు సింగం 123 - రామ్ శివమ్ - విష్ణు డైనమైట్ - నితిన్ కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాలు కూడా అంచనాల నడుమ విడుదలై అలరించలేకపోయాయి.