Begin typing your search above and press return to search.
చైతూ సరసన నిలిచేందుకు కాస్త దూరంలో అఖిల్
By: Tupaki Desk | 17 Oct 2021 2:55 PM GMTకరోనా కారణంగా వందల కోట్లు రాబట్టే బాలీవుడ్ సినిమాలు కనీసం పాతిక కోట్లు రాబట్టేందుకు కిందా మీద పడుతున్నాయి. అలాంటిది మన తెలుగు సినిమాలు ఈజీగా భారీ వసూళ్లను నమోదు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున వసూళ్లు నమోదు చేస్తున్న తెలుగు సినిమాలు ఓవర్సీస్ మరియు ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా వసూళ్లను రాబడుతున్నాయి. ఈ ఏడాది విడుదల అయిన జాతి రత్నాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్లను దక్కించుకుంది. మళ్లీ సెకండ్ వేవ్ తర్వాత విడుదల అయిన లవ్ స్టోరీ సినిమా కూడా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు సినిమాలు మాత్రమే ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరాయి అనుకుంటున్న సమయంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కూడా మిలియన్ డాలర్లను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హాఫ్ మిలియన్ ను క్రాస్ చేసింది. కనుక అతి త్వరలోనే మిలియన్ డాలర్లను చేరుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి సందడి మరియు మహాసముద్రం సినిమాలకు రివ్యూలు పాజిటివ్ గా లేవు. ఓవర్సీస్ లో ఖచ్చితంగా రివ్యూల ఆధారంగానే కలెక్షన్స్ ఉంటాయి. బ్యాచిలర్ కు పాజిటివ్ రివ్యూలు వచ్చిన కారణంగా ఖచ్చితంగా ఈ సినిమా అక్కడ లాంగ్ రన్ లో మిలియన్ డాలర్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అఖిల్ తన హాలో సినిమా తో అక్కడ మిలియన్ క్లబ్ జాబితాలో చేరాడు. ఇప్పుడు రెండవ సారి కూడా మిలియన్ డాలర్లను వసూళ్లు చేసి బ్యాచిలర్ గా రెండవ సారి చోటును దక్కించుకుంటాడని తెలుస్తోంది.
లవ్ స్టోరీతో మిలియన్ డాలర్లను వసూళ్లు చేసిన నాగ చైతన్య ను చేరుకోవడంకు అఖిల్ కు పెద్ద కష్టం ఏమీ కాదని.. చాలా తక్కువ దూరంలోనే అఖిల్ ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఈ ఏడాది మూడవ మిలియనీర్ గా బ్యాచిలర్ నిలుస్తాడు అంటూ యూఎస్ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కనుక అవి అక్కడ మిలియన్ మార్క్ లను ఈజీగా క్రాస్ చేస్తాయి అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అఖిల్ కూడా ఆ జాబితాలో ఉండటం అక్కినేని ఫ్యాన్స్ కు గర్వ కారణం కానుంది. అతి తక్కువ వసూళ్లు నమోదు అవుతున్న ఈ ఏడాదిలో అక్కినేని బ్రదర్స్ ఇద్దరు మిలియన్ డాలర్లను దక్కించుకోవడం మామూలు విషయం కాదు. బ్యాచిలర్ సినిమాతో అఖిల్ కు మొదటి బెస్ట్ కమర్షియల్ సక్సెస్ పడిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.