Begin typing your search above and press return to search.
ప్రేక్షకులను నవ్వించబోతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'
By: Tupaki Desk | 1 Oct 2021 4:30 AM GMTకంటెంట్ బాగుంటే కరోనా ని కూడా కేర్ చేయకుండా జనాలు థియేటర్లకు వస్తారని తెలుగు ఆడియన్స్ నిరూపించారు. సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలలో చాలావరకు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాయి. అందుకే వరుసగా సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. అయితే ఎక్కువగా సీరియస్ సినిమాలే వస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన చిత్రాల్లో 'ఎస్ఆర్ కళ్యాణమండపం' 'రాజ రాజ చోర' మాత్రమే జనాల్ని కాస్తో కూస్తో నవ్వించాయి.
ఆ తరువాత వచ్చిన ప్రతి సినిమా సీరియస్ జోనర్ లోనే ఉంది. థియేటర్ కి వెళ్లి హాయిగా కూర్చోని నవ్వుకునేంత సినిమా 'జాతి రత్నాలు' తర్వాత మరొకటి రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' చిత్రం జనాలను నవ్విస్తుందని టాక్ వినిపిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 15న ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇది హ్యూమరస్ గా సాగే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో అఖిల్ క్యారక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని.. మంచి సక్సెస్ అందిస్తుందని చెబుతున్నారు. గ్లామర్ పాత్రలతో మెప్పిస్తూ వస్తున్న పూజా హెగ్డే ఈ చిత్రంలో స్టాండ్-అప్ కమెడియన్ గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం పూజా తనను తాను మలచుకున్న తీరు ఆశ్చర్యం కలిగించిందని దర్శకుడు భాస్కర్ చెబుతున్నారు.
స్టాండప్ కామెడీ సన్నివేశాల సమయంలో పూజా కళ్లలో ఫైర్ మరియు ఉత్సాహాన్ని చూశానని అఖిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాలో కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ క్లైమాక్స్ లో ఓ కొత్త అంశాన్ని దర్శకుడు తెలియజేయబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమని - ఈషా రెబ్బా - చిన్మయి - వెన్నెల కిషోర్ - మురళీశర్మ - జయప్రకాష్ - అజయ్ - ప్రగతి - అమిత్ తివారి - సుడిగాలి సుధీర్ - గెటప్ శ్రీను - అభయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
'బొమ్మరిల్లు' 'పరుగు' వంటి విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన భాస్కర్.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానని ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తి కలిగించింది. ముఖ్యంగా సాంగ్స్ శ్రోతలను విశేషంగా అలరించి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు.