Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో పెళ్లి కానీ ప్రసాదులు

By:  Tupaki Desk   |   23 May 2018 6:13 AM GMT
టాలీవుడ్ లో పెళ్లి కానీ ప్రసాదులు
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మల్లేశ్వరి సినిమాలో ఏ ముహూర్తాన పెళ్లి కానీ ప్రసాద్ అనే పేరుని సృష్టించాడో కానీ అప్పటి నుంచి అదొక వాడకం లాగా మారిపోయింది. పెళ్లి వయసు దాటిపోయిన యువకులను అలా పిలవడం సాధారణం అయ్యింది. టాలీవుడ్ లో సైతం అలాంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. మామూలుగా పెళ్ళైనా సరే యూత్ హీరోల మీద ఫోకస్ చాలానే ఉంటుంది. మరి ఇక పెళ్లి కానీ బ్రహ్మచారులు సంగతి ప్రత్యేకంగా చెప్పాలా. కానీ మన హీరోలు మాత్రం కెరీర్ ను బిల్డ్ చేసుకునే క్రమంలో పెళ్లిని ఆలస్యం చేస్తూ పోవడం అటు అభిమానులనే కాదు కుటుంబ సభ్యులను కూడా ఖంగారు పెడుతోంది.

ఇందులో మొదటి ప్లేస్ లో ఉన్నవాడు డార్లింగ్ ప్రభాస్. బాహుబలి తర్వాత ఒక ఇంటి వాడు అవుతాడేమో అని ఆశిస్తే ఇప్పుడు దాని స్థానంలో సాహో వచ్చి చేరింది కానీ పరిస్థితిలో మార్పు లేదు. మరోపక్క అనుష్కతో సం థింగ్ సం థింగ్ అంటూ పుకార్ల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. భల్లాలదేవా రానా పరిస్థితి భిన్నంగా ఏమి లేదు. తెలుగుతో పాటు హిందీ తమిళ సినిమాలు చేసుకుంటున్న రానాను దీని గురించి అడిగే వీలు కూడా అతను ఇవ్వడం లేదు.

శర్వానంద్ మూడు నాలుగు సినిమాలను సెట్ చేసుకోవడంలో శ్రద్ధ వహిస్తున్నాడు కానీ పెళ్లి గురించిన ప్రస్తావన మాత్రం తీసుకురావడం లేదు. త్వరలో జరగవచ్చేమో అనేలా ఒక ఇంటర్వ్యూలో నారా రోహిత్ చెప్పాడు కానీ దాని ఊసే మళ్ళి ఎత్తడం లేదు. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్ -వరుణ్ తేజ్ లది కూడా ఇదే కథ. అదేమంటే తొందరేముంది అంటున్నారు. కుర్ర హీరో నిఖిల్ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు కానీ ఏది ఒక కొలిక్కి రావడం లేదని తెలిసింది. ఛలోతో గట్టి హిట్టు కొట్టిన నాగ శౌర్య కూడా ఇదే బ్యాచ్ లో ఉన్నాడు.

వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే నిన్నటి తరం యూత్ హీరో తరుణ్ కూడా స్టిల్ బ్యాచిలరే. ఈ మధ్య సినిమాల్లో కం బ్యాక్ ఇద్దామని ప్రయత్నించాడు కానీ వర్క్ అవుట్ కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే అవుతుంది కానీ ఆగదు. అసలే ఈ మధ్య ఏ సెలబ్రిటీ పెళ్లి జరక్క కాస్త డ్రై గా ఉంది సీజన్. మాంచి ముహూర్తాలు ఉన్నా కూడా ఏ హీరో నుంచి శుభవార్త రావడం లేదు. మరి ఈ సిరీస్ ని ఎవరు బ్రేక్ ముందు పెళ్లి చేసుకుంటారో కాలం కాదు వాళ్ళే నిర్ణయించాలి