Begin typing your search above and press return to search.
2020లో పెళ్లేనా.. కెరీర్ గోల ఎన్నాళ్లు?
By: Tupaki Desk | 17 Dec 2019 6:18 AM GMTకొత్త సంవత్సరం కొత్త ఆశల్ని మోసుకొస్తోందా? యంగ్ బ్యాచిలర్ హీరోలకు బ్యాండ్ బాజా మోగే తరుణం తెస్తోందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ఇప్పటికిప్పుడు అరడజను పైగా బ్యాచిలర్ హీరోలు పెళ్లి కోసం వెయిటింగ్. ఇంట్లో వాళ్లు సతాయిస్తున్నా... జస్ట్ వెయిట్ అంటూ వెయిటింగ్ లో ఉంచడంతో ఇన్నాళ్లు ఓపిక పట్టారట. ఇక సహించేట్టు కనిపించడం లేదట. బ్రహ్మచారి ముదిరినా.. బెండ ముదిరినా ప్రమాదమేననేది ఇంట్లోవాళ్ల కంగారు. మరి 2020లో ఈ కంగారు తగ్గించేది ఎందరు? అన్నది ఆరా తీస్తే..
క్యూలో ప్రభాస్- రానా- నితిన్- నిఖిల్- దేవరకొండ- తనీష్- నవదీప్- ప్రిన్స్- ఆర్.ఎక్స్ 100 కార్తికేయ లాంటి హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. నితిన్ కి ఇప్పటికే కుదిరింది... ప్రేమ పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. అయితే దానికి సంబంధించి నితిన్ నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. నిఖిల్ పెళ్లి కుదిరింది. బిజినెస్ ఫ్యామిలీ నుంచి డాక్టర్ తేజస్వితో నిశ్చితార్థం అయ్యింది. త్వరలో పెళ్లాడబోతున్నాడు. దీనిపై తనే స్వయంగా వివరాలు అందించాడు.
డార్లింగ్ ప్రభాస్ మాటేమిటి? ఇంట్లోవాళ్లు వెంటపడుతున్నా తననుంచి సరైన ఆన్సర్ లేదు. బాహుబలి టైమ్ నుంచి ఇదిగో అదిగో అంటూ దాట వేస్తున్నాడు. కానీ ఇక ఈ ఏడాది తప్పదనే వినిపిస్తోంది. పెదనాన్న కృష్ణం రాజు కుమారుడి పెళ్లి కోసం ఎంతో ఆత్రంగా ఉన్నారు. సంబంధాలు వెతుకుతూనే ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. పారిశ్రామిక వేత్త కుమార్తె.. రాజకీయ నాయకుడు కుమార్తె.. విదేశీ అమ్మాయి అంటూ రకరకాలుగా ప్రచారం సాగుతున్నా ఏదీ క్లారిటీ రాలేదు. కొత్త సంవత్సరంలో క్లారిటీ రావొచ్చట. ప్రభాస్ కొలీగ్ రానా కూడా కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు. అయితే అతడి నుంచి సడెన్ గా ప్రకటన వస్తుందేమో అని అభిమానులు భావిస్తున్నారు.
రౌడీ విజయ్ దేవరకొండ.. `నోటా` రిలీజ్ టైమ్ లో 26 ఏజ్ పెళ్లికి కరెక్ట్ అన్నాడు కానీ.. ఇంకా ఎందుకనో వెయిటింగ్. మొన్ననే కొత్త ఇంట్లోకి మారాడు. ఇక పెళ్లికి బ్యాండ్ బాజా మోగడమే పెండింగ్. తల్లిదండ్రులు సంబంధాలు వెతికే పనిలోనే ఉన్నారని ఓ గుసగుస వినిపిస్తోంది.
తనీష్ .. సంబంధాలు చూస్తున్నారట. అయితే ఇంకా ఏ క్లారిటీ రాలేదు. నవదీప్.. సంబంధాలు చూస్తున్నా కానీ.. ఎందుకనో డిలే. తరుణ్.. పెళ్లిపై ఏదీ మాట్లాడడు సౌండ్ లేదు ఏమిటో. రాజ్ తరుణ్.. మాటా మంతీ లేదు.. ఇంకా కెరీర్ పైనే దృష్టి సారించాడు. ప్రిన్స్.. ఇంకా కెరీర్ సెట్ కాలేదు.. కొంత వెయిట్ చేయాలేమో!
ఆర్.ఎక్స్ 100 కార్తికేయ.. కెరీర్ స్పీడ్ పెంచాల్సి ఉందింకా. స్థిరంగా నిలబెడితే పెళ్లేనన్నది అభిమానుల భావన.
కెరీర్ ఎలా ఉన్నా కానీ టైమొస్తే పెళ్లాడేయడమే కరెక్ట్ అని పెద్దలు.. అనుభవజ్ఞులు అంటుంటారు. బెండ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా అంతే సంగతి!! అన్న కామెంట్లు వినిపిస్తుంటాయి. మరి ఇప్పటికైనా సదరు హీరోలు పెళ్లి మాటను దాట వేయకుండా కొంచెం కేర్ చేస్తేనే బావుంటుందేమో!