Begin typing your search above and press return to search.
టాలీవుడ్ టాప్ స్టార్స్ అంటే నెపోటిజం హీరోలేనా...?
By: Tupaki Desk | 16 Sep 2020 2:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో మెయిన్ గా నలుగురు సీనియర్ స్టార్ హీరోలు మరియు ఆరుగురు స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి - అక్కినేని నాగార్జున - విక్టరీ వెంకటేష్ - నందమూరి బాలకృష్ణ రెండు తరాల వారికి వారధిగా నిలబడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పునాదులు వేసిన నందమూరి తారక రామారావు - అక్కినేని నాగేశ్వరరావు - కృష్ణ - శోభన్ బాబు - కృష్ణంరాజు తెలుగు సినిమా కోసం ఎంతో కృషి చేశారు. అందులోనూ వీరంతా క్రింది స్థాయి నుంచి వచ్చి స్వయంకృషితో ఆ స్థాయికి ఎదిగినవారు. కానీ ఆ తర్వాత జెనరేషన్ లో నాలుగు స్తంభాలుగా నిలబడిన హీరోలలో చిరంజీవి ఒక్కడే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబడ్డాడు. నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ ముగ్గురూ నటవారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినవారే.
నేటి తరం ఆరుగురు స్టార్ హీరోలు సూపర్ స్టార్ట్ మహేష్ బాబు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - అల్లు అర్జున్ లు అందరూ నటవారసులే. మెగా ఫ్యామిలీ నుంచి పవన్ - చరణ్ - బన్నీ వస్తే కృష్ణ వారసుడిగా మహేష్.. కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అయితే నెపోటిజం హీరోలని పిలవబడుతున్నప్పటికీ వీరందరూ సినిమా కోసం చాలా కష్టపడి స్టార్ హీరోలు అనిపించుకునే రేంజ్ కి వచ్చారు. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించే సినిమాలు చేస్తూ ఒకరికొకరు పోటీగా నిలుస్తున్నారు. కాకపోతే టాలీవుడ్ టాప్ స్టార్స్ అంటే ఇకపై ఎప్పటికీ నటవారసులే ఉంటారా అనే ప్రశ్న తలెత్తుతుంది.
టాలీవుడ్ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కొన్నేళ్లపాటు ఈ హీరోలు మాత్రమే పిల్లర్స్ గా నిలబడే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ఎవరి అండదండలు లేకుండా సినీ కష్టాలు అనుభవించి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న మాస్ మహారాజా రవితేజ మరియు నేచులర్ స్టార్ నాని కి కూడా టాలీవుడ్ మెయిన్ పిల్లర్స్ గా నిలిచే సత్తా ఉందని చెప్పవచ్చు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చిన ఈ ఇద్దరూ మినిమమ్ గ్యారంటీ హీరోలుగా.. నిర్మాతల హీరోలుగా పిలవబడుతున్నారు. అయితే ఈ మధ్య రవితేజ సరైన సక్సెస్ లేక కాస్త వెనుకబడిపోయాడు. కానీ మళ్ళీ రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడితే మళ్ళీ రవితేజ రేస్ లో నిలబడే అవకాశం ఉంది. ఇక నాని ప్రస్తుతం అర డజను సినిమాలు చేతిలో పెట్టుకొని జోష్ లో ఉన్నాడు. సో ఫ్యామిలీ హీరోలతో పాటు వీరిద్దరూ కూడా టాలీవుడ్ కి మూల స్తంభాలుగా.. టాప్ స్టార్స్ గా మారే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.