Begin typing your search above and press return to search.
2022లో అత్యధికంగా ట్రోల్ చేయబడిన తెలుగు సినిమాలు
By: Tupaki Desk | 23 Dec 2022 4:16 AM GMT2022 సంవత్సరం పూర్తి అవ్వబోతుంది. ఈ సంవత్సరంలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వందల కొద్ది సినిమాలు వచ్చాయి. ఎప్పటిలాగే చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సొంతం చేసుకోగా.. చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా బొక్క బోర్లా పడ్డాయి. కొన్ని సినిమాలు వందల కోట్ల నష్టాలను చవి చూశాయి.
బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన సినిమాల్లో కొన్ని దారుణమైన సోషల్ మీడియా ట్రోల్స్ ను ఎదుర్కొన్నాయి. కొన్ని సినిమాలు కలెక్షన్స్ విషయంలో పర్వాలేదు అనిపించుకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ కు గురి అయ్యాయి.
ఈ ఏడాది విడుదల అయిన సినిమాల్లో అత్యధికంగా ట్రోల్స్ కి గురి అయిన సినిమా సన్నాఫ్ ఇండియా. ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించిన విషయం తెల్సిందే. వీఎఫ్‌ఎక్స్ మొదలుకుని ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన సన్నాఫ్ ఇండియా సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా ట్రోల్స్ ఎదురయ్యాయి.
మంచు విష్ణు హీరోగా రూపొందిన జిన్నా సినిమా కూడా దారుణంగా నిరాశపరచడంతో కూడా విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పూత్ నటించినా కూడా నిరాశ పర్చడంతో జిన్నా సినిమా ను పెద్ద ఎత్తున విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు.
ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా కూడా దారుణమైన ట్రోల్స్ ను ఎదుర్కొంది. టైటానిక్ రేంజ్ లో క్లైమాక్స్ ప్లాన్ చేశాం అన్నారు.. ఇదేంటీ అంటూ సోషల్ మీడియాలో దర్శకుడిపై మాత్రమే కాకుండా ప్రభాస్ మరియు హీరోయిన్ పూజా హెగ్డే పై కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
ఈ ఏడాది విడుదల అయిన సినిమాల్లో ఆచార్య... రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా సోషల్ మీడియాలో విమర్శల పాలు అయ్యాయి. ఇక విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ట్రోల్స్ ఏ స్థాయిలో వచ్చాయో తెల్సిందే.
ముఖ్యంగా విజయ్ దేవరకొండ యొక్క నత్తి గురించి రకరకాలుగా ట్రోల్స్ వచ్చాయి. ట్రోల్స్ ఎదుర్కొన్న సినిమాలు కొన్ని అయితే.. అదే సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కించుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ ట్రోల్స్ ను దృష్టిలో పెట్టుకుని ఫిల్మ్ మేకర్స్ 2023 లో అయినా మంచి సినిమాలతో వస్తారని ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.