Begin typing your search above and press return to search.

ఓటిటిని క్రాష్ చేసిన 'మోస్ట్ వాంటెడ్ భాయ్' మూవీ!

By:  Tupaki Desk   |   13 May 2021 11:53 AM GMT
ఓటిటిని క్రాష్ చేసిన మోస్ట్ వాంటెడ్ భాయ్ మూవీ!
X
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన మోస్ట్ వాంటెడ్ భాయ్ 'రాధే' మూవీ ఈద్ సందర్బంగా ఈరోజు ఓటిటి జీ5లో విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నలభైకి పైగా దేశాలలో విడుదల అవుతుందట. అలాగే పలు విదేశీ మార్కెట్లలో రాధే మూవీ థియేట్రికల్ రిలీజ్ కూడా అవుతుంది. అయితే ఓటిటి ప్లాట్ ఫామ్ జీ5లో చూసే వారు చందా చెల్లించాల్సి ఉంటుంది. 'పే పర్ వ్యూ' రాధే సినిమాకు 249/- ప్రైస్ సెట్ చేశారు మేకర్స్. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా 2గంటల 33నిముషాల వ్యవధి కలిగి ఉందట.

అయితే మొన్నటివరకు రాధే విడుదల పై కన్ఫ్యూషన్ లో ఉన్నటువంటి సల్మాన్ భాయ్ ఇటీవలే సోషల్ మీడియా పరంగా క్లారిటీ ఇచ్చేసాడు. నిజానికి ఈ మూవీ గతేడాది విడుదల కావాల్సింది. కానీ అప్పుడు కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. రాధే మూవీ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ 'రాధే ది మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమా గురించి ఆ మధ్యలో సినిమా ఖచ్చితంగా థియేటర్లలో విడుదల అవుతుందని అనుకున్నారు కానీ కరోనా వాటన్నిటికీ బ్రేక్ వేసేసింది. ఇప్పట్లో థియేటర్స్ అయ్యే గ్యారంటీ లేదు. ఎందుకంటే థియేటర్స్ ఓపెన్ అవ్వాలంటే కరోనా పోవాల్సిందే. ఇప్పట్లో ఆ వాతావరణం కనిపించడం లేదు.

అందుకని సల్మాన్ తాజాగా రాధే మూవీ ఈద్ రోజున డిజిటల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. చెప్పినట్లుగానే మే 13న ఈద్ సందర్బంగా 'జీ ప్లెక్స్'లో 'పే పర్ వాచ్' పద్ధతిలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ యాక్షన్ డ్రామా మూవీ యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కారణంగా ఓటిటి జీ5 కాసేపు క్రాష్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అలా రిలీజ్ అయిందో లేదో మిలియన్స్ సంఖ్యలో వీక్షకులు ఓపెన్ చేశారట. పే పర్ వ్యూ సిస్టమ్ పెట్టినప్పటికి భాయ్ సినిమాకు ఈ రేంజిలో రెస్పాన్స్ రావడం అనేది విశేషమే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమాలో దిశాపటాని హీరోయిన్ కాగా ప్రభుదేవా దర్శకత్వం వహించాడు.