Begin typing your search above and press return to search.
హీరోయిన్ సంగీతపై కంప్లైంట్ చేసిన అమ్మ!
By: Tupaki Desk | 13 April 2019 7:01 AM GMTనిజ జీవితంలో పరిస్థితులు.. మనుషుల మధ్య సంబంధాలు సూరజ్ బరజాత్య సినిమాలలో ఉన్నట్టుగా ఉండవు. డబ్బు దగ్గర తేడా వస్తే నాన్న - కొడుకు.. అమ్మ - కూతుళ్ళ మధ్య కూడా గొడవలు తప్పవు. రీసెంట్ గా 'ఖడ్గం' ఫేమ్ హీరోయిన్ సంగీతపై సంగీత అమ్మగారు తమిళనాడు మహిళా కమీషన్ కు కంప్లయింట్ ఇచ్చింది.
డీటైల్స్ లోకి వెళ్తే.. సంగీత తల్లి పేరు భానుమతి. చెన్నైలోని వలసరవాక్కంలో ఆమె నివాసం. ఆమె ప్రస్తుతం ఉండే ఇల్లు తన మామ గారి నుండి వచ్చింది. ఇప్పుడు ఆ ఇల్లు హీరోయిన్ సంగీత పేరు మీదే ఉందట. కింద భాగంలో భానుమతి నివసిస్తుడగా.. ఇంటి పైభాగంలో సంగీత - క్రిష్ దంపతులు ఉంటున్నారు. భానుమతి తన కంప్లయింట్ లో సంగీత తనను ఇంటిని వదిలి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తోందని పేర్కొన్నారు. ఇంటిని తన సోదరులు అపహరిస్తారనే భయంతో ఇలా తను ఒత్తిడి చేస్తోందని.. ఈ అవసాన దశలో నేను ఇల్లు వదిలి ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదని మహిళా కమీషన్ ఎదుట తన గోడు చెప్పుకున్నారు.
దీనిపై సంగీత.. ఆమె భర్త క్రిష్ మహిళా కమీషన్ ఎదుట హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ విషయం పై తన సోషల్ మీడియా ద్వారా ఒక పెద్ద పోస్ట్ పెట్టిన సంగీత తన తల్లి చిన్నప్పటి నుంచి తనను ఎంతో ఇబ్బంది పెట్టిందని.. తనతో బ్లాంక్ చెక్కులపై సైన్ చేయించుకుందని.. అసలు తల్లి ఎలా ఉండకూడదో సరిగ్గా అలాగే తనతో వ్యవహరించిందని తన వెర్షన్ వినిపించింది.