Begin typing your search above and press return to search.

అమ్మనైనా నేను ఇంకా యంగే..!

By:  Tupaki Desk   |   23 Aug 2022 5:13 AM GMT
అమ్మనైనా నేను ఇంకా యంగే..!
X
బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సోనమ్ కపూర్‌ దంపతులు ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆగస్టు 20వ తారీకున అమ్మ అయిన సోనమ్ కపూర్ సోషల్‌ మీడియా ద్వారా తన ఆనందంను షేర్ చేసుకుంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయం లోనే ఆనంద్ ఆహుజా ను పెళ్ల చేసుకున్న సోనమ్ కపూర్‌ పెళ్లి అయిన కొన్నాళ్లకు ప్రెగ్నెంట్‌ అయ్యింది.

ప్రెగ్నెంట్‌ గా ఉన్న సమయంలో పదుల కొద్ది ఫోటో షూట్స్ ను విడుదల చేసిన ఈ అమ్మడు తాజాగా సోషల్‌ మీడియా ద్వారా తన యొక్క ప్రెగ్నెన్సీ అనుభవాలను షేర్‌ చేసింది. చాలా మంది ముప్పై ఏళ్లు దాటిన ఆడవారు ప్రెగ్నెంట్ అయితే సమస్యలు ఎదుర్కొంటారు.. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారు. కానీ నాకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు అంది.

ఎందుకంటే నేను అమ్మనైనా.. నా వయసు 37 ఏళ్లు అయినా కూడా నేను ఇంకా యంగ్‌ గానే ఉన్నాను. నాలో నా తండ్రి (అనీల్‌ కపూర్‌) జీన్స్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. నేను ఇప్పటికి అమ్మాయినే.. చాలా యంగ్‌ గానే ఉన్నాను.. ఉంటాను అన్నట్లుగా పేర్కొంది. అమ్మను అయినంత మాత్రాన నేను వయసు మీద పడిన మహిళ ను కాదు అన్నట్లుగా సోనమ్ చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌ సెలబ్రెటీలు పలువురు సోనమ్‌ కపూర్‌ తల్లి అయిన సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేశారు. సోనమ్‌ మరియు ఆనంద్‌ లు తల్లిదండ్రులు అయిన ఆనందంను కుటుంబ సభ్యులతో పంచుకుంటూ పార్టీ చేసుకుంటున్నారట.