Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ః భయానక మదర్
By: Tupaki Desk | 9 Aug 2017 4:27 AM GMTహాలీవుడ్ యాక్షన్ సినిమాలు అంటే ప్రపంచం మొత్తం మంచి క్రేజ్ ఉంటుంది. దానితో పాటుగా హాలీవుడ్ హారర్ సినిమాలు అన్న అంతే క్రేజ్ ఉంటుంది. సైకలాజికల్ హారర్ సినిమాలను చెప్పడంలో ఆరితేరిన డాడారెన్ ఆరోనోఫస్కీ కి ఇప్పుడు మరో హారర్ సినిమా తో రాబోతున్నాడు. జెనీఫర్ లారెన్స్ ప్రధాన పాత్రలో ‘మదర్’ అనే ఒక హారర్ సినిమా సెప్టెంబర్ 15 నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది. మదర్ టీజర్ వచ్చి గగుర్పాటు కలిగించే శబ్ధాలతో అందరికి ఒక షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ను బట్టి చూస్తే మరో హాలీవుడ్ స్టైల్ హారర్ రాబోతుంది అని తెలుస్తుంది.
ఈ సినిమా మొత్తం ఒక కపుల్ చుట్టూ ఉంటుంది అని తెలుస్తుంది. జనాలుకు దూరంగా ఉన్న ఒక ఇంటిలో ఒక కపుల్ ఉంటారు. ఒకరి పై ఒకరు ప్రేమతో ఉన్న వాళ్ళ మధ్య ఒక కొత్త మనిషి ఆశ్రయం కోసం వస్తాడు. అప్పటి నుండి ఇంటిలోను వాళ్ళ సంబంధంలోను మార్పు వస్తుంది. హీరోలో అప్పటి వరకు వెలుగులోకి రాని చీకటి కోణం బయటపడుతుంది. ఇంటిలో అలజడి పెరుగుతుంది కొత్త అగంతకులు పెరుగుతూ వస్తారు. రక్తం - మనుషులు - ఇల్లు - ఒకఊహ - కొన్ని పీడకలలు ఇలా నడుస్తూ ఉంది సినిమా ట్రైలర్. అయితే అందరూ బాగానే ఉన్న జెనీఫర్ లారెన్స్ మాత్రమే భయపడుతుంది. అయితే ఆ ఇంటిలో ఏమి జరిగింది అసలు ఆ ఇల్లు ఎవరిది అనేది ఇప్పుడు ఆలోచన రాకమానదు. కొత్తగా ఆ ఇంటిలోకి వచ్చిన అపరిచితులుదా లేదా ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ జంటగా. హీరో జవీర్ బర్దెమ్ సైకాలజీ కూడా కొంచెం తేడాగా అనిపిస్తుంది. అందరూ కలిసి జెనీఫర్ ను ఏమి చేశారు అనేది చూడాలి.
హారర్ సినిమాలను అభిమానించే వారికి ఇది తప్పకుండా ఆనందాన్ని ఇస్తుంది. చీకటి రాత్రులు - భయానక శబ్దాలతో మరో గొప్ప హారర్ సినిమాగా ఉండబోతుంది అని చెప్పవచ్చు. పారామౌంట్ ప్రొడక్షన్ నిర్మించియా మదర్ సినిమాలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత నటి జెనీఫర్ లారెన్స్ - స్పానిష్ నటుడు జవీర్ బర్దెమ్ అలాగే నటుడు డైరెక్టర్ ఎడ్ హ్యారిస్ ముఖ్య పాత్రలులో నటించారు. ఈ సినిమాను డైరెక్టర్ డారెన్ ఆరోనోఫస్కీ డైరెక్ట్ చేశాడు.