Begin typing your search above and press return to search.

వరుణ్, రేవతి.. సువ్వి సువ్వాలమ్మా!

By:  Tupaki Desk   |   28 Sep 2015 1:30 PM GMT
వరుణ్, రేవతి.. సువ్వి సువ్వాలమ్మా!
X
ఇప్పటి స్టార్ డైరెక్టర్లకు సెంటిమెంట్ అంటే అస్సలు పడదు. అందులోనూ రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు వాటి జోలికి అస్సలు వెళ్లరు. కానీ ఇప్పటిదాకా పూరి అలాగే సాగాడు కానీ.. ఇప్పుడు మాత్రం కొత్తగా సెంటిమెంటు మాట ఎత్తుతున్నాడు. ‘లోఫర్’ సినిమాలో బీభత్సమైన మదర్ సెంటిమెంటు ఉందని.. అది చూసి రామ్ గోపాల్ వర్మ కూడా ఫ్లాట్ అయిపోయాడని అంటున్నాడు పూరి.

ఐతే యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘లోఫర్’ ప్రధానంగా మదర్ సెంటిమెంట్ మీద నడిచే సినిమానే అట. ఇందులో వరుణ్ కు తల్లిగా సీనియర్ నటి రేవతి నటిస్తుండటం విశేషం. ఈ మధ్య తెలుగులో పూర్తిగా సినిమాలు మానేసిన రేవతి.. పూరి చెప్పిన క్యారెక్టర్ తెగ నచ్చేయడం వల్లే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట.

వరుణ్, రేవతిల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా పండాయని.. ఇద్దరి మధ్య ‘సువ్వి సువ్వి సువ్వాలమ్మా’ అనే పాపులర్ లిరిక్ తో పాట కూడా ఉంటుందని.. ఆ పాట సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. పతాక సన్నివేశాల్లో పూరి ఎన్నడూ లేనంతగా ఎమోషన్ - సెంటిమెంటు దట్టించాడని.. వాటికి ప్రేక్షకులు ఫ్లాట్ అయిపోతారని చెబుతున్నారు. చూద్దాం.. ‘లోఫర్’లో మదర్ సెంటిమెంటు ఏ రేంజిలో పండిందో.