Begin typing your search above and press return to search.
లారెన్స్ అదరగొట్టేశాడుగా..
By: Tupaki Desk | 27 March 2016 10:12 AM GMT‘కాంఛన’ సిరీస్ సినిమాలతో తమిళ ప్రేక్షకులకు చాలా ఇష్టమైన దర్శకుడు.. నటుడు అయిపోయాడు రాఘవ లారెన్స్. అందులోనూ ‘కాంఛన-3’ అయితే అక్కడ భీభత్సమైన హిట్టయిపోయింది. రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించి గత ఏడాది తమిళంలో అతి పెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది ‘కాంఛన-3’. దీని తర్వాత లారెన్స్ ఏం సినిమా చేస్తాడా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తమిళ ఆడియన్స్. ఓవైపు కాంఛన సిరీస్‌లో ఓ సినిమా అనౌన్స్ చేసి.. దాని కంటే ముందు తెలుగు బ్లాక్ బస్టర్ ‘పటాస్’ను రీమేక్ చేయడానికి రంగంలో దిగాడు రాఘవ లారెన్స్. నాలుగు నెలల కిందటే సినిమా మొదలుపెట్టి.. చకచకా సినిమా పూర్తి చేసేసి.. మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసేసింది లారెన్స్ అండ్ కో.
యానిమేటెడ్ వర్క్ తో చాలా ఆసక్తికరంగా ఈ మోషన్ పోస్టర్ ను తీర్చిదిద్దింది ‘మొట్ట శివ కెట్ట శివ టీమ్’. లారెన్స్ లెంగ్తీ డైలాగ్ తో అదరగొట్టాడు. ‘పటాస్’లో ఇంటర్వెల్ తర్వాత విలన్ కు కళ్యాణ్ రామ్ ధమ్కీ ఇచ్చే డైలాగే ఇది. తెలుగులో కంటే తమిళంలో పవర్ ఫుల్ డైలాగ్ రాశారు. తెలుగులో కళ్యాణ్ రామ్ రాడ్ తో రౌడీని కొట్టే షాట్ ను కూడా దీనికి వాడుకున్నారు. ‘మొట్ట శివ కెట్ట శివ’ అనేది కాంఛన-3లో పాపులర్ అయిన డైలాగ్. దాన్నే ‘పటాస్’ రీమేక్ కు టైటిల్ గా వాడుకున్నారు. ‘ది మాస్ కాప్’ అనేది ట్యాగ్ లైన్. ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయిరమణి దర్శకత్వం వహించాడు. నిక్కీ గర్లాని కథానాయికగా నటించింది. మే నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వీడియో కోసం క్లిక్ చేయండి