Begin typing your search above and press return to search.
పటాస్ రీమేక్ కు భలే టైటిల్
By: Tupaki Desk | 3 Aug 2015 1:38 PM GMTగంగ (కాంఛన-2) సినిమాలో లారెన్స్ ‘మొండి శివ.. గుండు శివ’ అంటూ చెప్పిన ఓ డైలాగ్ మాస్ ఆడియన్స్ కు భలే కనెక్టయింది. తమిళంలో దీన్నే మొట్ట శివ.. కెట్ట శివ అన్నాడు లారెన్స్. మొట్ట అంటే గుండు, కెట్ట అంటే చెడ్డ అని అర్థం. ఈ డైలాగ్ తమిళనాడును ఓ ఊపు ఊపేసింది. అంత పాపులర్ అయిన డైలాగ్ ను ఊరికే వదిలేయట్లేదు లారెన్స్. తన కొత్త సినిమాకు టైటిల్ గా పెట్టేశాడు. ఆ సినిమా మరేదో కాదు.. తెలుగులో సూపర్ హిట్టయిన పటాస్ కు రీమేక్. ముందు ఈ సినిమాను ఆర్.బి.చౌదరి నిర్మిస్తారని ప్రచారం జరిగింది కానీ.. ఇప్పుడు వెండార్ మూవీస్ అనే సంస్థ ఈ ప్రాజెక్టులోకి వచ్చింది.
పటాస్ రీమేక్ లో లారెన్స్ హీరో మాత్రమే అని.. దర్శకుడు వేరేవారని కూడా అన్నారు కానీ.. సోమవారం సినిమాను లాంచ్ చేస్తూ డైరెక్టర్ కూడా లారెన్సే అని ప్రకటించారు. ఇప్పటిదాకా లారెన్స్ దర్శకుడిగా స్ట్రెయిట్ మూవీసే చేశాడు. తొలిసారి రీమేక్ కు దర్శకత్వం చేయబోతున్నాడన్నమాట. మొట్ట శివ అంటున్నాడు కాబట్టి.. ఇందులో లారెన్స్ గుండుతోనే కనిపించే అవకాశాలున్నాయి. కన్నడలో పటాస్ రీమేక్ ను మక్కీకి మక్కీ దించేస్తున్నారు. హీరో గెటప్ కూడా అలాగే ఉంది. ఐతే తమిళ రీమేక్ విషయంలో చాలా మార్పులు జరిగేట్లున్నాయి. ఇప్పటికే గెటప్ విషయంలో ఛేంచ్ ఖాయమని తేలిపోయింది. లారెన్స్ డైరెక్షన్ అంటే అతడి ముద్ర కచ్చితంగా ఉంటుంది కాబట్టి.. మాస్ ఆడియన్స్ కు మరింతగా కనెక్టయ్యేలా సినిమాను తీర్చిదిద్దే అవకాశముంది. తెలుగులో మనమిప్పటికే ‘పటాస్’ చూసేశాం కాబట్టి.. ఈ సినిమా ఓన్లీ ఫర్ తమిళ ఆడియన్స్ అన్నమాట.