Begin typing your search above and press return to search.
అదిరిపోయే థీమ్ తో మెగాస్టార్ పాట
By: Tupaki Desk | 7 Dec 2016 4:32 AM GMTఅభిమానుల ఆకలి తీరడానికి నెల రోజులే ఉంది. జనవరిలో మెగాస్టార్ చిరంజీవి 150 మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది. సంవత్సరాల గ్యాప్ తర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తోన్న మూవీ కావడంతో చిరు సినిమా రిచ్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోన్న రామ్ చరణ్.
ముఖ్యంగా సాంగ్స్ పిక్చరైజేషన్ విషయంలో తెలుగు స్క్రీన్ పై ఇంతకు ముందు చూడని విజువల్ ఫీస్ట్ అందించడానికి ఎఫెర్ట్ పెడ్తోంది ఖైదీ నెంబర్ 150 యూనిట్. ఇప్పటికే ఉక్రేనియాలోని బ్యూటీఫుల్ లోకేషన్స్ లో పాటలు షూట్ చేసుకొచ్చారు. మరో సాంగ్ లో ఏకంగా మౌలిన్ రోగ్ థీమ్ వాడబోతున్నారు. మౌలిన్ రోగ్- పారిస్ లో ఫేమస్ నైట్ క్లబ్. వందల ఏళ్ల చరిత్రున్న మౌలిన్ రోగ్ నైట్ క్లబ్ ని బేస్ చేసుకోని హాలీవుడ్లో చాలా సినిమాలు కూడా వచ్చాయ్. ఇప్పుడు చిరు ల్యాండ్ మార్క్ ఫిల్మ్ లో ఆ మౌలిన్ రోగ్ రెప్లికాని దించబోతున్నారు. రెడ్ విండ్ మిల్ తో సహా మౌలిన్ రోగ్ భారీ సెట్ వేసి అందులో పాట తీయబోతున్నారు.
మాములుగానే మౌలిన్ రోగ్ అంటే రిచ్ గా ఉంటుంది.. మరి చిరు మూవీలో దాన్ని ఇంకెంత లావిష్ గా చూపిస్తారో.. అక్కడ తీసేది సాంగ్ కాబట్టి స్టెప్స్ ఇంకెంత అదిరిపోతాయో. ఏ మాటకామాట చెప్పుకోవాలి నిర్మాతగా ఫస్ట్ మూవీనే అయినా చెర్రీ బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావట్లదనే విషయం మరోసారి ప్రూవ్ అయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/