Begin typing your search above and press return to search.

మ్యారీడ్ బ్యూటీ బికినీ షోపై `పుష్ప` పంచ్ లు

By:  Tupaki Desk   |   13 Feb 2022 12:30 AM GMT
మ్యారీడ్ బ్యూటీ బికినీ షోపై `పుష్ప` పంచ్ లు
X
గత నెలలో గోవాలో డ్రీమ్ వెడ్డింగ్ తర్వాత మౌని రాయ్ -సూరజ్ నంబియార్ తమ హనీమూన్ ను కాశ్మీర్ లోని గుల్ మార్గ్ లో జరుపుకున్నారు. మౌని తన ఇన్ స్టాగ్రామ్ ఫీడ్ ను తాజాగా వేడెక్కించే ఫోటోల‌తో నింపేసారు. మంచు పర్వత సానువుల చెంత అతిథి గృహం నుంచి మౌని- సూరజ్ జంట ఫోటోషూట్ తో ఇన్ స్టా నిండింది. అయితే మంచు కొండల నేపథ్యంలో మోనోకినీలో మౌని ఫోటోలు నెటిజనుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మౌని రాయ్ గడ్డకట్టే కాశ్మీర్ లో నల్లటి మోనోకినిలో సాహ‌సం చేసింద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ``పువ్వు నై ఫైర్ హై తూ`` అంటూ అభిమానులు జోష్ చూపించారు ఈ ఫోటోలు వీక్షించాక‌. గడ్డకట్టే గుల్మార్గ్ లో కూడా టెంప‌రేచ‌ర్ పెంచేసిందంటూ కొంద‌రు అభిమానులు వ్యాఖ్యానించారు. మంచు కొండలకు ఎదురుగా భారీ గాజు కిటికీలతో కూడిన అతిథి గృహంలో మౌని ఇలా పోజులిచ్చింది. ``ముద్దులు స్నోఫ్లేక్స్ అయితే ... నేను మీకు మంచు తుఫానును పంపుతాను`` అంటూ పోయెటిక్ కొటేష‌న్ ని రాసింది ఈ ఫోటోలు షేర్ చేసిన‌ మౌని.

మౌని షేర్ చేసిన అద్భుతమైన ఫోటోలపై ప్రశంసలు కురుస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు నిజంగా ఈ ఫోటోలు సూప‌ర్భ్ అంటూ పొగిడేశారు. ఎంతగా అంటే త‌న‌ అభిమానులు ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ చిత్రం పుష్ప- ది రైజ్ లోని పాపుల‌ర్ డైలాగ్ ను ఉప‌యోగిస్తూ ఫ‌న్ ని క్రియేట్ చేశారు. “తు మౌని నహీ తూ ఫైర్ హై” అంటూ అల్లు అర్జున్ డైలా గ్‌ను ట్వీకింగ్ చేస్తూ ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు - “పుష్ప నామ్ సుంకే ఫ్లవర్ సంజే క్యా.. ఫ్లవర్ నహీ ఫైర్ హై” అంటూ వేరొక అభిమాని వ్యాఖ్య‌ను జోడించారు.

“నామ్ సన్ కె ఫ్లవర్ సంజయ్ నీ కియా ఫైర్” అంటూ దీనికి స్మైలీ మౌని రిప్ల‌య్ ఇచ్చింది. ``ఫ్లవర్ నై ఫైర్ హై తూ`` అని మరొక అభిమాని రాశాడు. మొత్తానికి మ్యారీడ్ మౌని బికినీ కం మోనోకిని షో బంప‌ర్ హిట్ట‌య్యింది. కేజీఎఫ్ చిత్రంలో ఐట‌మ్ నంబ‌ర్ తో ఆక‌ట్టుకున్న మౌనీకి ఆ త‌ర్వాత సౌత్ లో బిజీ అవుతుంద‌ని భావించినా ప‌ప్పులేవీ ఉడ‌క‌లేదు. ఇప్ప‌టికీ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ప్ర‌స్తుతానికి హిందీ చిత్ర‌సీమ‌పైనే త‌న హోప్స్ ని పెట్టుకుంది.