Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: షోకేస్ లో బొమ్మ‌లా ఉన్నావు అమ్మీ..!

By:  Tupaki Desk   |   31 Aug 2022 11:30 PM GMT
ఫోటో స్టోరి: షోకేస్ లో బొమ్మ‌లా ఉన్నావు అమ్మీ..!
X
షోకేస్ లో బార్బీ బొమ్మ‌లా క‌నిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అందాల మౌనీ రాయ్ ఇలా స్పెష‌ల్ ఫోటోషూట్ తో క‌ట్టి ప‌డేసింది. మౌని రెడ్ హాట్ లుక్ ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

2022 రెడ్ కార్పెట్ సీజన్ స్టార్ట‌యింది. ఇక మెరుపులే మెరుపులు. తాజాగా మౌని రాయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2022 ఈవెంట్లో ఇలా కిక్కిచ్చే లుక్ తో దిగిపోవ‌డంతో ఈవెంట్లో కళ్ల‌న్నీ ఈ అమ్మ‌డిపైనే వాలిపోయాయి. మౌని రాయ్ రోజువారీ షెడ్యూళ్ల నుంచి బ‌య‌టప‌డి ఇలా రెడ్ కార్పెట్ ప్రదర్శన కోసం సిద్ధ‌మైంది. ప్రకాశవంతమైన గులాబీ రంగు వన్-షోల్డర్ కార్సెట్ గౌనులో మెరుపులు మెరిపించింది.

ఆ డిజైన‌ర్ గౌనును నిశితంగా పరిశీలిస్తే ఆ స‌న్న‌జాజి నడుముపై ఉన్న కార్సెట్ మ‌రింతగా బిగి అందాల‌ను బ‌హిర్గ‌తం చేసింది. స్టైలిష్ .. బార్బీ లుక్ తో మెరిపించింది. బ్లూ మ్యాట్ నేప‌థ్యంలో ఎరుపు రంగు దుస్తులు ఒక క్లాసిక్ అయితే ఆకర్షణీయమైన నైట్ అవుట్ లో మౌని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

మౌనిరాయ్ అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న 'గోల్డ్' అనే చిత్రంతో బాలీవుడ్ లో ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత సౌత్ లో కేజీఎఫ్ లాంటి క్రేజీ చిత్రంలో ఐట‌మ్ నంబ‌ర్ లో మెరిసింది. తెలుగులో ఈ భామ క‌థానాయిక‌గా రంగ ప్ర‌వేశం చేయ‌నుంద‌ని టాక్ వినిపించినా వీలుప‌డ‌లేదు. ఇంత‌లోనే ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ప్రియుడు సూరజ్ నంబియార్ తో మౌని షికార్ల‌పై గుస‌గుస‌లు వినిపించాయి.

ఆ త‌ర్వాత అత‌డితో పెళ్లి వ్య‌వ‌హారం.. విహార‌యాత్ర‌ల‌తో జాలీ లైఫ్ గురించి తెలిసిందే. ప్ర‌స్తుతం మౌని నాగిన్ సిరీస్ లో న‌టిస్తూనే చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇటీవ‌ల మాల్దీవుల విహారాన్ని ఆస్వాధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

ఇక‌ మౌని రాయ్ త‌న భ‌ర్త నంబియార్ తో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూనే సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. ర‌ణ‌బీర్ బ్ర‌హ్మాస్త్ర‌లో మౌని ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.