Begin typing your search above and press return to search.
#గుసగుస.. బండ్లతో మంచు విష్ణు వర్గం సంప్రదింపులు?
By: Tupaki Desk | 7 Sep 2021 7:30 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠ పెంచుతున్న సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికల మాదిరిగా ఒకరితో ఒకరు పోటీపడుతూ ఘర్షణకు తెర తీస్తుంటే మా పదవులతో తాయిలం ఏం ముడుతుందోనంటూ సందేహాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు. గత అధ్యక్షులు మురళీమోహన్ .. రాజేంద్ర ప్రసాద్ ఇదంతా పరపతి కోసం గౌరవ మర్యాదల కోసమే సంపాదించుకోవడానికి కాదని తేల్చి చెప్పేశారు. కానీ దానికి కాంట్రాస్ట్ గా ఈ ఎన్నికల వ్యవహారం కనిపిస్తోంది.
అయినా `మా` అసోసియేషన్ పదవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఓవైపు ప్రకాష్ రాజ్ వర్గం మరోవైపు విష్ణు మంచు వర్గం ఎవరికి వారు వర్గపోరు మొదలు పెట్టారు. గ్రూపు రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఎవరి కాంపౌండ్ నుంచి ఎవరు ఎవరిని లాగేసుకుంటారో తెలీని పరిస్థితి. ఇంతకుముందు మంచు విష్ణు కాంపౌండ్ కి అనుకూలంగా ఉంటారని భావించిన జీవిత రాజశేఖర్ నేరుగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో చేరడంతో అంతా అవాక్కయ్యారు. మెగా అండదండలతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ గెలుపు ఖాయమని ఊహించిన జీవిత పదవి కోసమే ఇలా చేశారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇక జీవిత చేరికతో నటుడు బండ్ల గణేష్ కి ప్యానెల్ లో సభ్యత్వం లభించలేదు. దీంతో అతడు తీవ్రంగా హర్టయి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.
జీవిత రాజశేఖర్ కి వ్యతిరేకంగా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు బండ్ల గణేష్ సంసిద్ధమవుతున్నారు. `మా` సంఘం జనరల్ సెక్రటరీగా పదవి చేపడతానని బండ్ల ఆశగా ఉన్నాడు. అయితే ఇంతలోనే ప్రకాష్ రాజ్ తో బండ్ల వైరం నేపథ్యంలో మంచు విష్ణు వర్గం అతడిని తమ కాంపౌండ్ లోకి లాక్కునేందుకు పదవిని ఎరవేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ ప్యానెల్ తరపున జనరల్ సెక్రటరీగా పోటీ చేసేందుకు విష్ణు ఆఫర్ ఇచ్చారని కథనాలొస్తున్నాయి. అయితే బండ్ల అవతలి పార్టీలో చేరతారా లేదా? అన్నదానిపై స్పష్ఠత లేదు.
ఒకవేళ బండ్ల మంచు విష్ణు కాంపౌండ్ లో చేరితే గనుక అది తన వెనక ఉండి కథను నడిపిస్తున్న ఘోస్ట్ కి కోపం తెప్పించేందుకు ఆస్కారం లేకపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన దైవాలైన చిరంజీవి - పవన్ కల్యాణ్ బ్రదర్స్ ని విమర్శించిన జీవితను రాజశేఖర్ ను వ్యతిరేకించే బండ్ల ఇప్పుడు మంచు కాంపౌండ్ లో చేరితో అది మెగా బ్రదర్స్ కి రుచించకపోవచ్చు అంటూ కథనాలు అల్లుతున్నారు. ఓవరాల్ గా బండ్ల ఇప్పుడు మంచు కాంపౌండ్ లో చేరతారా? అన్నదే ఆసక్తికరంగా మారింది. ఓవైపు తన దేవుడు పవన్ కల్యాణ్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్న బండ్ల ఆ అవకాశం కోసం ఎంతో ఆశగా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలా గోడ దూకుతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. స్వతంత్రుడిగా పోటీ చేస్తే దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. పాపం పసోడైన బండ్ల ఈ గ్రూపు రాజకీయాల్లో అనవసరంగా నలిగిపోతున్నాడేమిటో..!
నెలరోజుల్లో తేలిపోతుంది...!
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల ఫలితం మరో నెలరోజుల్లో తేలిపోనుంది. అక్టోబర్ 10న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నెలరోజుల పాటు ఒక రేంజులోనే వార్ నడువనుంది. గ్రూపు రాజకీయాలు నడిపిస్తున్నా మీడియా ముందు ఎవరూ అసోసియేషన్ పరువు తీయొద్దని మా క్రమశిక్షణా కమిటీ కోరుతోంది. దానివల్ల కొంతవరకూ వివాదాలు కట్టడి అయ్యాయని భావిస్తున్నారు.