Begin typing your search above and press return to search.

మన సెలబ్స్‌ మాట: ట‌పాకాయ‌లు పేల్చ‌కండి

By:  Tupaki Desk   |   9 Nov 2015 5:30 PM GMT
మన సెలబ్స్‌ మాట: ట‌పాకాయ‌లు పేల్చ‌కండి
X
దీపావ‌ళి అంటేనే ట‌పాకాయ‌ల సంద‌డి. చిచ్చుబుడ్లు - పాము బిళ్ల‌లు - భూచ‌క్రాలు - కాక‌ర‌పువ్వొత్తులే కాదు.. సీరియ‌ల్ దండ‌లు - సీమ ట‌పాకాయ‌లు - బాంబ్‌ లు .. పేలుడే పేలుడు. వీటివ‌ల్ల వ‌చ్చే శ‌బ్ధ‌కాలుష్యం కూడా ఆ రేంజులోనే ఉంటుంది. ఆ ఒక్క‌రోజే బోలెడంత‌మంది శాశ్వ‌త చెవిటిత‌నానికి గుర‌యిన సంఘ‌ట‌న‌లు - కాలి బొబ్బ‌లెక్కిన సంద‌ర్భాలు.. బోలెడ‌న్ని ఉన్నాయి. ఏటేటా ఈ ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. అందుకే ఎందుకంత క‌ష్టం? క‌్రాకర్స్ కాల్చ‌కండి.. శ‌బ్ధ‌కాలుష్యం చేయ‌కండి.. అంటూ స‌రికొత్త నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్నారు మ‌న సెల‌బ్రిటీస్‌.

దీపావ‌ళిని సైలెంటుగా చేసుకోండి. ఇంటిల్లిపాదీ ఏ ప్ర‌మాదాల‌తో ఆడుకోకుండా సంతోషంగా ఉండండి అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అందులో ర‌కూల్ ప్రీత్ సింగ్‌ - సందీప్ కిష‌న్‌ - నిఖిల్‌ - సునీల్‌ - వ‌రుణ్‌ తేజ్‌ - మ‌న్నారా చోప్రా - ర‌ణ‌ధీర్.. ఇలా యువ‌త‌రం న‌టీన‌టులంతా ఉన్నారు. దీపావ‌ళి అంటేనే శ‌బ్ధ‌కాలుష్యం. అందుకే నేను ప‌దో త‌ర‌గ‌తి నుంచే ట‌పాకాయ‌లు కాల్చ‌డం వ‌దిలేశా. కాలుష్యాన్ని నేను ఎంక‌రేజ్ చేయ‌ను. దీపాల పండ‌గ‌ను ప్ర‌శాంతంగా చేసుకోవాల‌ని కోరుకుంటాను... అని అంది ర‌కూల్‌. ఎప్ప‌టిలానే ఈ ఏడాది కూడా దీపాల పండ‌గ‌ను ఇంట్లోనే చేసుకుంటున్నాన‌ని చెప్పింది. సందీప్‌ కిష‌న్ సైతం ర‌కూల్‌కి వంత‌పాడాడు. నేను కూడా సేమ్ టు సేమ్ అన్నాడు. ఫ్యామిలీ - స్నేహితుల‌తో క‌లిసి సైలెంట్ దీవాలీ చేసుకుంటున్నా అన్నాడు.

స్నేహితుల‌తో క‌లిసి నేనుకూడా సైలెంట్ దీపావ‌ళికే ప్రాధాన్య‌త‌నిస్తున్నాన‌ని నిఖిల్ అన్నాడు. నోవా ఆర్మీ అనే ఎన్జీవో సంస్థ దీపావ‌ళి శ‌బ్ధాల వ‌ల్ల మూగ‌ప్రాణులు మూగ‌వోతున్నాయ‌న్న సంగ‌తిని అర్థ‌మ‌య్యేలా చెబుతోంది. ఐదేళ్ల నుంచి నేను ట‌పాకాయ‌లు పేల్చేందుకు వ్య‌తిరేకిన‌య్యాన‌ని అన్నాడు. మ‌న్నారా - ర‌ణ‌ధీర్ వంటి న‌టీన‌టులు సైలెంట్ దీపావ‌ళికే ప్రాధాన్య‌త‌నిచ్చామ‌న్నారు.