Begin typing your search above and press return to search.
సినిమా ఫైనాన్స్ కేరాఫ్ సీడెడ్...!
By: Tupaki Desk | 19 Aug 2020 1:30 PM GMTసినిమా అనేది కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం అనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో పెద్ద సినిమాలు సుమారు 50 నుండి 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తుంటారు. అయితే అంత మొత్తం పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ఫైనాన్సియర్లని ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతం నుంచి సినిమాకి ఫైనాన్స్ ఇచ్చేవారు ఎక్కువగా ఉంటారు. సీడెడ్ అంటే ఇప్పటి నాలుగు రాయలసీమ జిల్లాలు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ ప్రొడ్యూసర్స్ నుండి మీడియం రేంజ్ నిర్మాతల వరకు ఎవరైనా కథ కాంబినేషన్ కుదిరితే ఫైనాన్స్ కోసం సీడెడ్ వెళ్లాల్సిందే. కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు బ్యాంకు రుణాలు కూడా కొంత మేర తీసుకుంటాయి. అయితే ఎంతో కొంత సినిమా ఫైనాన్స్ లేదా పొలిటికల్ ఫైనాన్స్ తీసుకోక తప్పదు.
ఈ నేపథ్యంలో 90 శాతం తెలుగు సినిమాలకి డబ్బులు సీడెడ్ ఏరియా నుంచే వస్తున్నాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఇండస్ట్రీలోని చాలామంది ప్రొడ్యూసర్స్ రూ. 3 నుంచి రూ. 10 వరకు వడ్డీ చొప్పున ఇక్కడ సినిమాలకు ఫైనాన్స్ దొరుకుతుంది. సినిమా అమ్ముడు పోయిన తర్వాత నిర్మాతలు తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తుంటారు. అయితే ఒకప్పుడు విజయవాడ సినిమా ఫైనాన్స్ కి అడ్డాగా ఉండేది. అదంతా ఇప్పుడు సీడెడ్ కి షిఫ్ట్ అయిపోయింది. ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న భారీ బడ్జెట్ ప్రాజెక్టులన్నింటికీ సీడెడ్ నుండే ఫైనాన్స్ వచ్చిందని తెలుస్తోంది.
కాగా కరోనా మహమ్మారి కారణంగా గత ఐదు నెలల నుండి సినిమాకి సంబంధించిన కార్యకలాపాలు ఆగిపోయాయి. ఒకటి అరా వర్క్స్ స్టార్ట్ చేసినప్పటికీ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. దీంతో ఫైనాన్స్ తెచ్చుకున్న ప్రొడ్యూసర్స్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మామూలుగా అయితే సినిమాలు కంప్లీట్ అయిన తరువాత విడుదల చేసే ముందు ఫైనాన్స్ సెటిల్ మెంట్లు వుంటాయి. కానీ ఇప్పుడు సినిమాలు విడుదల అవకపోవడంతో పెట్టుబడులు ఎక్కడికక్కడ స్టక్ అయిపోయాయి. దీంతో కొందరు నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీలలో రిలీజ్ చేసుకొని ఫైనాన్స్ చెల్లిస్తున్నారు. కానీ పెద్ద సినిమాల ప్రొడ్యూసర్స్ మాత్రం తమ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేయలేక.. థియేటర్స్ తెరిచే వరకు వెయిట్ చేస్తూ వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారట. మరి ఈ విపత్కర పరిస్థితిని అర్థం చేసుకొని సీడెడ్ ఫైనాన్సియర్లు కనీసం రెండు మూడు నెలలకైనా వడ్డీ మాఫీ చేస్తారేమో చూడాలి.