Begin typing your search above and press return to search.
రీ రిలీజ్ లతో ఘోరంగా అవమానిస్తున్నారా?
By: Tupaki Desk | 11 Dec 2022 4:11 PM GMTగత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ మొదలైంది. క్రేజీ హీరోలకు సంబంధించిన కెరీర్ టర్నింగ్ సినిమాలని 4కెలో రీ మాస్టర్ చేసి రీ రిలీజ్‌చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ క్రేజీ సినిమాల నుంచి ప్రతీ హీరో కెరీర్ బెస్ట్ మూవీస్ ని బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ చేయడం ఈ మధ్య ఫ్యాషన్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ 'పోకిరి'తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పడు ఆడియన్స్ పేషెన్సీని పరీక్షించేదిగా మారి ఎవంర్ గ్రీన్ సినిమాలకు శాపంగా మారుతోంది.
హీరోల బర్త్ డేలని టార్గెట్ చేస్తూ మొదలైన ఈ ట్రెండ్ ఇప్పడు క్లాసిక్స్ ని కూడా వదలడం లేదు. అంతే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ లని కాకుండా కెరీర్ లో డిజాస్టర్ అనిపించుకున్న సినిమయాలని కూడా రీ రిలీజ్ పేరుతో రిలీజ్ చేస్తూ క్యాష్ చేసుకోవాలనే బ్యాచ్ ఇప్పడు టాలీవుడ్ లో తయారైంది. క్లాసిక్ హిట్ లు, బ్లాక్ బస్టర్లతో పాటు ఈ బ్యాచ్ భారీ డిజాస్టర్లని కూడా వదలడం లేదు. హిట్ సినిమాల క్రేజ్ ని క్యాష్ చేసుకునే క్రమంలో రీ రిలీజ్ చేస్తూ వాటిని దారుణంగా అవమానిస్తున్నారు.
రీసెంట్ గా చెన్నకేశవరెడ్డి'ని రీ రిలీజ్ చేసిన అదే ఊపుతో ప్రభాస్ డిజాస్టర్ 'రెబల్' ని కూడా మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చి క్యాష్ చేసుకోవాలని తెగ తాపత్రయ పడింది. ఇప్పడు క్లాసిక్ మూవీస్ గా పేరు తెచ్చుకున్న మాయాబజార్, ప్రేమ దేశం చిత్రాలని రీ రిలీజ్ చేశాయి.
సాధారణ సినిమా టికెట్ రేట్లని ఈ సినిమాలకు అప్లై చేయడంతో ఈ సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లకు ప్రేక్షకులే రావడం లేదు. అది గమనించిన ఈ సినిమా లవర్స్ క్లాసిక్స్ ని దారుణంగా అవమానిస్తున్నారే అంటూ మండిపడుతున్నారు.
కొత్త సినిమాల కోసమే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో భారీగా ఖర్చు పెట్టుకుని పాత సినిమాల కోసం వస్తారనుకోవడం మూర్ఖత్వమే అవుతోందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
రీ రిలీజ్ లు ఎప్పుడో ఒక సారి చేస్తే ఒకే కానీ అతే పనిగా దండయాత్ర తరహాలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తుండటం వాటిని ప్రేక్షకులు ఆదరించకపోవడంతో క్లాసిక్ బ్లాక్ బస్టర్లకు తీవ్ర అవమానం జరుగుతోందని వాపోతున్నారు. ఈ నెలాఖరున బద్రి, గ్యాంగ్ లీడర్ సినిమాలని రిలీజ్ చేయబోతున్నారు. ఇవి గనక థియేటర్లలో ఫుల్ కాకపోతే అవమానించినట్టే అవుతుంది. ఈ అరాచకాన్ని ఇప్పటితో ఆపితే అందరికి గౌరవంగా వుంటుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.