Begin typing your search above and press return to search.

కంటెంట్ ఓల్డ్ అయిపోతుందేమో.. ఆలోచించుకోండి బాసూ...!

By:  Tupaki Desk   |   16 Sep 2020 5:32 PM GMT
కంటెంట్ ఓల్డ్ అయిపోతుందేమో.. ఆలోచించుకోండి బాసూ...!
X
కరోనా వైరస్ కారణంగా గత ఆరున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యున్నాయి. అయితే ప్రభుత్వం షూటింగులకు అనుమతులిచ్చినా థియేటర్స్ ఎప్పుడు తెరవాలనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ థియేటర్స్ రీ ఓపెన్ చేసినా కూడా జనాలు థియేటర్స్‌ కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే నిర్మాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సినిమాల నిర్మాణం కోసం ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. దీంతో ఆలోచనలో పడ్డ కొంతమంది మేకర్స్ త‌మ సినిమాలను డిజిటల్ ప్లాట్‌ ఫార్మ్ లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

కాగా, ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక తెలుగులో ఈ మధ్య వరకు చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వగా.. ఇప్పుడిప్పుడే క్రేజీ మూవీస్ కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. అయితే కొందరు మేకర్స్ మాత్రం తమ సినిమాల్ని ఓటీటీలో విడుదల చేయాలా.. థియేటర్స్ ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేయాలా అనే డైలమాలో ఉన్నారని తెలుస్తోంది. అయితే రోజులు గడిచే కొద్దీ కంటెంట్ ఓల్డ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని విషయం కూడా ఇక్కడ మేకర్స్ ఆలోచించుకోవాలని సినీ నిపుణులు చెప్తున్నారు. ఏదైనా ఆ రోజుకు మాత్రమే కొత్తగా ఉంటుంది.. రోజులు గడిస్తే దాన్ని పాతదిగానే చూస్తారనే విషయం తెలిసిందే.

ఇటీవల నాని - సుధీర్ బాబు నటించిన థ్రిల్లర్ మూవీ 'వి' ఓటీటీలో రిలీజ్ అయింది. ఉగాదికి విడుదల కావాల్సిన ఈ సినిమాని ఫ్యాన్సీ రేట్ రావడంతో డిజిటల్ రిలీజ్ చేశారు. అయితే థ్రిల్లర్ అంటూ వచ్చిన 'వి' లాంటి థ్రిల్లింగ్ సినిమాలు ఆల్రెడీ చూసి ఉండటంతో ఆడియన్స్ ఈ మూవీపై పెదవి విరిచారు. ఎందుకంటే ఈ లాక్ డౌన్ లో అనేక థ్రిల్లర్ మూవీస్ రిలీజ్ అవడంతో.. ఇంటికే పరిమితమైన జనాలు వాటిని చూసేసి ఉన్నారు. అందుకే 'వి' సినిమాని చూసి పెద్దగా థ్రిల్ ఫీల్ అవలేకపోయామనే కామెంట్స్ వినిపించాయి. సాధారణంగా లేట్ గా రిలీజైన సినిమాలపై ఆడియన్స్ దాదాపుగా ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చుతుంటారు.

అందులోనూ ప్రస్తుతం ఓటీటీలలో అన్ని భాషల చిత్రాలు విరివిరిగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ ని ఇవ్వడమే ఫిలిం మేకర్స్ కి ఛాలెంజ్ గా మారింది. ఈ నేపథ్యంలో ఓల్డ్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే కంటెంట్ పాత పడకముందే సినిమాల రిలీజ్ విషయంలో మేకర్స్ ఏదొక క్లారిటీకి వచ్చేస్తే మంచిదని ఓటీటీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఫైనాన్స్ పరంగా మేకర్స్ కి ఇబ్బంది లేనప్పుడు.. తమ కంటెంట్ ఎప్పుడైనా ఫ్రెష్ గా ఉంటుంది అనుకునేవారికి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ భారం పడుతుందనుకునే మేకర్స్ మాత్రం ఈ విషయంపై ఏదొక నిర్ణయానికి వచ్చేస్తే మంచిదని ఎక్సపర్ట్స్ సలహా ఇస్తున్నారు.