Begin typing your search above and press return to search.

ఆ లొకేషన్స్ ఎందుకు.. దేశం వద్దా?

By:  Tupaki Desk   |   17 Sep 2017 5:30 PM GMT
ఆ లొకేషన్స్ ఎందుకు.. దేశం వద్దా?
X
ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాను తెరకెక్కించాలంటే బడ్జెట్ పరంగా రాజీపడినా పర్లేదు కాని లొకేషన్స్ పరంగా ఏ మాత్రం రాజీ తగదు అంటున్నారు దర్శకులు. కొంతమంది కథ పరంగా విదేశాల్లో సినిమాలను తీస్తుంటే.. మరికొంతమంది సినిమాకి హైప్ తేవాలని ఫారెన్ లొకేషన్స్ కావాలని ఏరి కోరి మరి కోరుకుంటున్నారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కథ డిమాండ్ చేస్తే ఫారెన్స్ ఏంటి. ఎక్కడికైనా వెళ్లాల్సిందే అంటారు.బాలీవుడ్ వాళ్ళు అయితే మ్యాక్సీమమ్ ఫారెన్ లో ఒక్క షాట్ అయినా పడాల్సిందే అంటారు..ఇక అక్కడ పెద్ద చిత్రాల గురించి చెప్పనక్కర్లేదు.

చిన్న బిట్ కోసం చైనా వెళదాం అంటారు. అయితే కొంత మంది హీరోలు మాత్రం మాతృభూమే మూవీలో ముద్దు అంటున్నారు. ఈ మధ్య బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని విజయాల్ని అందుకున్న సినిమాలు వెండితెరపై మాతృ దేశాన్నే చూపించాయి. సెట్ ఎసినా.. డ్యాన్స్ చేసినా ఇండియాలోని పరిసర ప్రాంతాలే పర్ఫెక్ట్ అంటున్నారు కొందరు దర్శకులు. అదే విధంగా కథ కూడా చాలా వరకు అలానే ఉండాలని డిమాండ్ చేయడం మరో కారణం చెప్పవచ్చు. రీసెంట్ గా బాలీవుడ్ యాక్షన్ హీరో స్టార్ స్టేటస్ ని లెక్క చేయకుండా "టాయిలెట్ "అనే సినిమాను తెరకెక్కించాడు. బాత్రూమ్ లేకుంటే ఎలాంటి ఇబ్బందీలు ఎదుర్కొంటారు అనే కోణంలో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ సినిమా మొత్తం ఉత్తరప్రదేశ్ పరిసర గ్రామాల్లో తెరకెక్కింది. అదే విధంగా 'బరేలీ కీ బర్ఫీ' అనే సినిమా షూటింగ్ ని కూడా ఉత్తరప్రదేశ్ లోనే జరిపారు. అదే విధంగా బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లక్నో సెంట్రల్‌’ చిత్రీకరణ కూడా పూర్తిగా ఉత్తరప్రదేశ్ లో జరగడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక చాలా రోజుల తర్వాత సంజయ్ దత్ నటించిన భూమి సినిమా లోకేషన్స్ కూడా పూర్తిగా ఇండియాకి చెందినవే. ఎక్కువగా ఈ సినిమా షూటింగ్ ను ఆగ్రాలో చేశారని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది.

నార్త్ లో కొందరు సినిమావాళ్ళు వారి మాతృభూమి ని ఎక్కువగా నమ్ముకుంటున్నారు. ఇక సౌత్ సైడ్ అయితే అందరూ దర్శకులు ఇండియాలో కట్ చెప్పి ఫారెన్ లో మళ్లీ యాక్షన్ అంటున్నారు. ఇప్పటివరకు సౌత్ లో దాదాపు అందరూ దర్శకులు ఫారెన్స్ లొకేషన్స్ ని వెళ్లినవారే అయితే సీనియర్ విలక్షణ దర్శకుడైన "బాల' మాత్రం ఇప్పటివరకు ఆ లొకేషన్స్ గురించి ఆలోచించలేదు. ఆయన కథలు కూడా చాలా వరకు గ్రామాల్లోనే ఉంటాయి. తెలుగులో అయితే కొన్ని చిన్న సినిమాల్లో తప్ప పూర్తిగా తెలుగు లొకేషన్స్ స్టార్స్ సినిమాలో కనిపించడం లేదు అంటున్నారు. రీసెంట్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి - ఫిదా లో లొకేషన్స్ సింపుల్ గా చాలా బావున్నాయని ప్రశంసలు అందుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో కథ పరంగా విదేశాలకు వెళ్లారే గాని స్వతహా ఎవరు కోరుకొని వెళ్ళలేదు. ఇక ఆ సినిమాల్లో కనిపించిన లొకేషన్స్ చాలా బావున్నాయి. ఫిదా లో అయితే తెలంగాణలో కూడా మంచి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయని దర్శకుడు చెప్పకనే చెప్పారు. అర్జున్ రెడ్డిలో కూడా చాలా వరకు లొకేషన్స్ సింపుల్ సూపర్బ్ అనేలా ఉన్నాయి. మరి ముందు ముందు అయినా వారు పూర్తిగా మాతృభూమి పై సినిమాను తీస్తారో లేదో చూడాలి.