Begin typing your search above and press return to search.

వార‌సురాలి ప‌రిచ‌యంలోనే సంగీత ద‌ర్శ‌కుడి ప్ర‌యోగం!

By:  Tupaki Desk   |   17 Sep 2021 2:30 PM GMT
వార‌సురాలి ప‌రిచ‌యంలోనే సంగీత ద‌ర్శ‌కుడి ప్ర‌యోగం!
X
గులాబీ - సముద్రం వంటి సినిమాలకు సంగీతం అందించిన సంగీత స్వరకర్త .. యాడ్ ఫిల్మ్ మేకర్ శశి ప్రీతమ్ తన కూతురు ఐశ్వర్య కృష్ణ ప్రియను `లైఫ్ ఆఫ్ 3` అనే సినిమాతో నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి శశి ప్రీతం స్వయంగా దర్శకత్వం వహించారు. సంగీతం కూడా సమకూర్చారు. ఆయ‌నే పాటలు కూడా రాశారు. యాదృచ్ఛికంగా ఈ చిత్రంతో శశి ప్రీతం దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

`లైఫ్ ఆఫ్ 3` ఫస్ట్ లుక్ .. ఆడియో ఆల్బమ్ నిన్న (సెప్టెంబర్ 15) శశి ప్రీతం పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యాయి. ఈ సినిమాలో యువ నటులు స్నేహల్ కామత్- సంతోష్ అనంతరామన్ - చిన్ని కృష్ణ- వైశాలి - సౌజన్య వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైఫ్ ఆఫ్ 3 ని దుష్యంత్ రెడ్డి తో క‌లిసి ఐశ్వ‌ర్య‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే శశి ప్రీతం అందిస్తున్నారు. అతను సినిమాటోగ్రఫీని కూడా నిర్వహించడం మ‌రో సంచ‌ల‌నం.

సంగీత ద‌ర్శ‌కుడిగా అత‌డు సంచ‌నాలు సృష్టించారు. ద‌ర్శ‌క ర‌చ‌యిత‌గానూ సాహ‌సాలు చేస్తున్నారు. ఆల్ రౌండ‌ర్ నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న శ‌శిప్రీత‌మ్ ఏ మేర‌కు రాణిస్తారో వేచి చూడాలి.