Begin typing your search above and press return to search.

దోపిడీపై చిన్న నిర్మాత‌లు క‌దం దొక్కారు

By:  Tupaki Desk   |   24 July 2016 4:30 AM GMT
దోపిడీపై చిన్న నిర్మాత‌లు క‌దం దొక్కారు
X
చిన్న సినిమాల విడుద‌ల విష‌యంలో రోజు రోజుకూ ఇబ్బందులు పెరిగిపోతుండ‌టంతో నిర్మాత‌లు పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. థియేట‌ర్లు దొర‌క్క‌పోవ‌డం.. క్యూబ్-యుఎఫ్ ఓ సిస్టమ్ రేట్లు విప‌రీతంగా పెరిగిపోవ‌డంపై రామ‌కృష్ణ గౌడ్ తో పాటు మ‌రింద‌రు చిన్న నిర్మాత‌లు ధ‌ర్నా మొద‌లుపెట్టారు. ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద నిర్మాత‌లంద‌రూ స‌మావేశం నిర్వ‌హించి.. ధ‌ర్నాకు దిగారు.

తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు.. క్యూబ్-యూఎఫ్ ఓ సిస్టమ్స్ కొందరు సినీ పెద్దల చేతుల్లో ఉన్నాయ‌ని.. దీంతో చిన్న నిర్మాత‌లు థియేట‌ర్లు దొర‌క్క‌.. భారీగా డ‌బ్బులు స‌మ‌ర్పించుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతోంద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. థియేట‌ర్లు దొర‌క‌డం ఓ స‌మ‌స్య అయితే.. దొరికినా క్యూబ్.. యూఎఫ్ ఓ పేరిట ఒక్క వారానికి రూ. 12 వేల దాకా వసూలు చేస్తున్నార‌ని.. ప‌క్క రాష్ట్రాల్లో వారానికి రూ.2,500 మాత్రమే వసూలు చేస్తున్నారని అన్నారు.

హైద‌రాబాద్ లోని సత్యం థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే ఒక్క వారానికి క్యూబ్ కోసం నిర్మాత నుండి రూ.2.5 ల‌క్ష‌లు తీసుకుంటున్నారని.. అసలు తీసుకోవాల్సింది రూ.1.3 ల‌క్ష‌ల‌ని.. ఇలా దోపిడీ చేస్తే నిర్మాత పరిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. త‌మ‌వద్ద డబ్బులు గుంజుతూ వాళ్లు కోట్లు గడిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ప‌న్ను కూడా చెల్లించకుండా మోసం చేస్తున్నారన్నారు. ప‌రిశ్ర‌మ వీరి వ‌ల్ల దారుణ‌మైన దోపిడీకి గుర‌వుతోంద‌ని.. ప్ర‌భుత్వం స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.