Begin typing your search above and press return to search.
ప్రొడ్యూసర్స్ గిల్ట్ సంచలన నిర్ణయం!?
By: Tupaki Desk | 16 July 2022 2:30 PM GMTకరోనా తరువాత నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. దానిక తగ్గట్టే ఆర్టిస్ట్ ల పారితోషికాలు కూడా చుక్కలు నంటుతున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా భారీగా రెమ్యునరేషన్ లని పెంచేశారట. అంతే కాకుండా ఇటీవల 24 క్రాప్ట్స్ కి చెందిన టెక్నిషయన్స్, జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా తమ కనీస వేతనాలు పెంచాల్సిందే అంటూ మెరుపు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఇలా ప్రతీ విషయంలోనూ సినిమాల నిర్మాణం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో టాలీవుడ్ యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది.
తాజా పరిణామాల నేపథ్యంలో యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో వున్న నిర్మాతలంతా శనివారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సంచలన నిర్ణయానికి రెడీ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కరోనా పరిస్థితుల నుంచి ఇండస్ట్రీ బయటపడిందని ఆనందించే లోపే పెరిగిన నిర్మాణ వ్యయం, స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, డైలీ లేబర్ లతో పాటు 24 క్రాఫ్ట్ లకు చెందిన వారంతా ముకుమ్మడిగా పారితోషికాలు పెంచేయడంతో సినిమాలు నిర్మించలేని స్థితిలో వున్నామని నిర్మాతలు వాపోతున్నారు.
అంతే కాకుండా ఇన్నింటినీ తట్టుకుని భారీ స్థాయిలో వ్యయప్రయాసల కోర్చి సినిమాలు పూర్తి చేసి విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్లలకు రావడం లేదు. పెరిగిన నిర్మాణ వ్యవయాన్ని కంట్రోల్ చేయలేక, థియేటర్లకు ప్రేక్షకులు రాక నానా అవస్థులు పడుతున్నామని విచారం వ్యక్తం చేస్తున్న గిల్డ్ ప్రొడ్యూసర్లు ఇవన్ని ఓ కొలిక్కి వచ్చాకే సినిమాల షూటింగ్ లని తిరిగి ప్రారంభించాలని, అంత వరకు కొత్తగా ప్రారంభమయ్యే సినిమాల షూటింగ్ లని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట.
పారితోషికాల విఝయంలో సమ్మెకు దిగుతూ కొంత మంది సినిమాల షూటింగ్ లని ఆపేస్తున్నారు. అలా కాకుండా వాటన్నింటినీ అదులో పెట్టాలంటే నిర్మాతలే సమ్మెకు దిగితే బాగుంటుందని అత్యధిక శాతం నిర్మాతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇలాగే వుంటే పరిస్థితి చేయిదాటి పోతుందని, ఇస్పటికైనా తేరుకుని కఠిన నిర్ణయాల్ని అమలు చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ అభిప్రాయానికి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
శనివారం ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ లు, కారవాన్ ల ఖర్చులు, వారు డిమాండ్ చేస్తున్న ఫైవ్ స్టార్ భోజన ఖర్చులతో పాటు కొంత మంది రోజు వారిగా, గంటల వారిగా రెమ్యునరేషన్ లని డిమాండ్ చేస్తున్న తీరు కూడా చర్చకు వచ్చినట్టుగా చెబుతున్నారు. దీనిపై కూడా సంచలన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో షూటింగ్ ల నిలుపుదలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన ప్రకటన చేయనుందని తెలిసింది.