Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాకు టికెట్లు తెగుతాయా ?
By: Tupaki Desk | 18 Aug 2019 5:18 AM GMTఒకప్పుడు సినిమా ప్రచారం అంటే పోస్టర్లే. దినపత్రికలు మ్యాగజైన్లతో పాటు అవుట్ డోర్ పబ్లిసిటీ చాలా కీలక పాత్ర పోషించేది. కానీ టెక్నాలజీ వాడకం పెరిగిపోయాక అందులోనూ సోషల్ మీడియా విస్తృతి ఎక్కడికో వెళ్ళిపోయాక టాలీవుడ్ ఈ పోకడను నమ్మి సాంప్రదాయ పద్ధతికి స్వస్తి పలకడం అంతగా ఫలితాలను ఇవ్వడం లేదు. ఫేస్ బుక్ - ట్విట్టర్ - ఇన్స్ టాగ్రామ్ ఇలా రకరకాల సామాజిక అనుసంధాన యాప్స్ లో సినిమాలను ప్రమోట్ చేయడం మీద పెడుతున్న ఫోకస్ సామాన్య జనంలోకి సినిమాను ఎలా తీసుకెళ్లాలి అనే దాని మీద పెట్టకపోవడం విచారకరం.
నిజానికి ఇంటర్ నెట్ వచ్చాక వార్తలు రివ్యూలు అందించే వెబ్ సైట్స్ తదితర డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కు ఆదరణ బాగా పెరిగింది. విశ్వసనీయతను సంపాదించుకున్న సంస్థలు ఇప్పటికీ ఈ రంగంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. చదువరులు సైతం వీటిలో వచ్చే సమాచారం ఖచ్చితంగా ఉంటుందని నమ్మినప్పుడు క్రమం తప్పకుండ ఫాలో అవుతున్నారు. కానీ సోషల్ మీడియాలో ఇలాంటి ఖచ్చితత్వం ఉండదు. ఎవరికి తోచింది వారు ఇష్టం వచ్చినట్టు అభిప్రాయాలు చెప్పుకోవచ్చు.
అధిక సందర్భాల్లో సదరు వ్యక్తుల లేదా కంపెనీల వ్యక్తిగత స్వార్థాలు ప్రయోజనాలు కూడా అందులో ఇమిడి ఉంటాయి. ఇందులో పాజిటివ్ నెగటివ్ రెండు కోణాలు ఉంటాయి. కానీ దేని ప్రభావం ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విచిత్రంగా మన తెలుగు సినిమా దర్శక నిర్మాతలు హీరోలు ఇలాంటి ట్రాప్స్ లో పడిపోయి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తేనే సినిమా రీచ్ అవుతుందనే భ్రమలో ఎందుకు ఉంటున్నారో అర్థం కావడం లేదు.
మిలియన్ల బడ్జెట్ తో రూపొందే హాలీవుడ్లో కేవలం ట్రైలర్లు మాత్రమే యుట్యూబ్ లో వదులుతారు. మిగిలిన ప్రచారమంతా పోస్టర్లు ఫ్లెక్షీలు ఎల్ఈడి డిస్ప్లేలు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. అంతే తప్ప ఇలా సోషల్ మీడియా ఉచ్చులో పడిపోయి చేటు చేసుకోరు. మనవాళ్ళు కూడా ఈ వలయం ఉంచి బయటికి వచ్చి రెగ్యులర్ స్టైల్ లో పబ్లిసిటీకి టర్న్ తీసుకోకపోతే ఆశించిన ఫలితాలు రావు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో కల్ట్ అని క్లాసిక్ అని మాస్టర్ పీస్ ని పొగిడిన కొన్ని సినిమాలు గ్రౌండ్ లెవెల్ లో మొదటి వారానికే థియేటర్ రెంట్లు కూడా తేలేక టపా కట్టేశాయి. సోషల్ మీడియాకే అంత సీన్ ఉంటే వీటి నిర్మాతలు సేఫ్ అయ్యేవాళ్ళుగా. ఆలోచించండి