Begin typing your search above and press return to search.

మూవీ సైంటిస్ట్ ఈసారి 10 మంది హీరోయిన్స్ తో ప్రయోగం!

By:  Tupaki Desk   |   29 April 2022 4:14 AM GMT
మూవీ సైంటిస్ట్ ఈసారి 10 మంది హీరోయిన్స్ తో ప్రయోగం!
X
సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్‌ సినిమాలు చేసే వారికి ఎక్కువ కాలం కెరీర్‌ ఉంటుంది. ఆ విషయం ను ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు. కెరీర్ లో ఒకటి రెండు ప్రయోగాత్మక సినిమాలు చేసే వారు ఉన్నారు కాని కెరీర్‌ ఆరంభం నుండి కూడా ప్రయోగాలు చేస్తునే ఉన్నాడు ఈ దర్శకుడు. ఈయన మొదటి సినిమా మొదలుకుని ప్రతి ఒక్కటి కూడా ప్రయోగాత్మక సినిమా అవ్వడంతో ఈయన్ను మూవీ సైంటిస్ట్ అంటూ అభిమానులు మరియు సన్నిహితులు పిలుచుకుంటున్నారు.

ఆయన మరెవరో కాదు 'అ!' అనే విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. మొదటి సినిమా విభిన్నమైన సినిమా అయినా కూడా కమర్షియల్‌ గా పర్వాలేదు అనిపించుకుని ఇండస్ట్రీలో మంచి పేరును దక్కించుకున్నాడు. ఇండియన్ సినిమా ప్రేక్షకులకు ఎప్పుడు పరిచయం లేని జాంబీ లను పరిచయం చేశాడు. జాంబీ రెడ్డి అనే ప్రయోగాత్మక సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ సూపర్ మ్యాన్‌ మూవీని చేస్తున్నాడు. జాంబీరెడ్డి చిత్ర హీరో తేజ సజ్జా హీరోగా సూపర్‌ మ్యాన్ మూవీ 'హనుమాన్‌' ను తీస్తున్నాడు. ఇదో విభిన్నమైన సినిమా అంటూ ఇప్పటికే ఆయన చెప్పుకొచ్చాడు. కమర్షియల్‌ గా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకున్నా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా గా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హనుమాన్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతి సినిమా ప్రయోగాత్మక సినిమానే అయినా కూడా ఏ ఒక్క సినిమా తర్వాత గ్యాప్ ను ఎక్కువగా తీసుకోవడం లేదు. తాను సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే.. ఇతర దర్శకులకు కథలను కూడా ఈయన అందిస్తూ ఉంటాడు. అంతే కాకుండా కమర్షియల్స్ కు కూడా దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉంటాడు.

ఇంతటి బిజీ కెరీర్‌ లో ఆయన మరో ప్రయోగాత్మక సినిమా కథను సిద్దం చేసుకున్నాడట. ఆ కథ కోసం ఆయనకు ఏకంగా పది మంది హీరోయిన్స్ కావాలంట. చిన్నా పెద్ద హీరోయిన్స్ కలయికలో ఆ సినిమా ను తీస్తానంటూ సన్నిహితుల వద్ద దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చెబుతున్నాడట.

హనుమాన్‌ సినిమా పూర్తి అయ్యి విడుదల అయిన వెంటనే ఆ పది మంది హీరోయిన్స్ తో ఈ సైంటిస్ట్ ప్రయోగాన్ని మొదలు పెట్టబోతున్నాడట. ఫలితం ఎలా ఉన్నా కూడా ఆ ప్రయోగం మాత్రం ఖచ్చితంగా చరిత్రలో నిలిచి పోతుంది అనేది కొందరి అభిప్రాయం.