Begin typing your search above and press return to search.

2022 పెళ్లి చేసుకున్న సినీ తారలు..!

By:  Tupaki Desk   |   24 Dec 2022 1:30 PM GMT
2022 పెళ్లి చేసుకున్న సినీ తారలు..!
X
తెరంగేట్రం చేసే టైం లో కెరీర్ ఎప్పటిదాకా వెళ్తుంది అన్నది చెప్పడం కష్టం. వరుస సినిమాలు చేస్తున్న టైం లో కూడా పర్సనల్ లైఫ్ కన్నా ప్రొఫెషనల్ లైఫ్ పైనే ఎక్కువ కేర్ తీసుకుంటారు. అందుకే స్టార్స్ అంతా కూడా పెళ్లి గురించి తమ కెరీర్ తర్వాత మాత్రమే అనే ఆలోచనలో ఉంటారు. ఈ ఏడాది సినీ సెలబ్రిటీస్ చాలామంది తమ పెళ్లి తో సర్ ప్రైజ్ చేశారు.

వీరిలో ముందుగా నాగిని సీరియల్ యాక్ట్రెస్ మౌనీ రాయ్ తన పెళ్లి తో షాక్ ఇచ్చింది. తన ప్రియుడు సూరజ్ నంబియార్ ని జనవరిలో పెళ్లాడింది. బెంగాలీ, మళయాళీ రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. ఇక ఇదే ఏడాది స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ల మ్యారేజ్ కూడా జరిగింది. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉండగా పెళ్లి పై రకరకాల వార్తలు వచ్చాయి. ఫైనల్ గా వారు ఏప్రిల్ 14న కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

ఇక సౌత్ సెలబ్రిటీస్ విషయానికి వస్తే మే 18న ఆది పినిశెట్టి, నిక్కి గర్లాని పెళ్లాడారు. ఇద్దరు కలిసి మలుపు సినిమాలో నటించారు. ఆ టైం లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అలా ఇద్దరు మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు.

కొన్నాళ్లుగా వీరి పెళ్లిపై మీడియా రకరకాల వార్తలు రాస్తున్నా సరే సైలెంట్ గా జూలై 9న పెళ్లాడారు విఘ్నేష్ శివన్, నయనతార. వీరిద్దరికి మీడియా ఇంతకుముందు చాలాసార్లు పెళ్లి చేయగా ఫైనల్ గా ఈ ఏడాది వీరి అఫీషియల్ మ్యారేజ్ జరిగింది.

హీరోయిన్ పూర్ణ కూడా ఈ ఏడాది తన మ్యారేజ్ చేసుకుంది. షానిద్ ఆసిఫ్ అలీని పూర్ణ పెళ్లాడింది. యువ హీరో నాగ శౌర్య కూడా తన ప్రేయసి అనూష శెట్టిని పెళ్లాడాడు. నవంబర్ 20న వీరి మ్యారేజ్ జరిగింది. నాగ శౌర్య ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడన్నది వారి ఎంగేజ్మెంట్ టైం లోనే బయటకు తెలిసింది.  

కోలీవుడ్ ప్రేమ జంట కూడా ఈ ఏడాది ఒకటైంది. మళయాళ హీరోయిన్ మంజిమా మోహన్, గౌతం కార్తీక్ ఇద్దరు నవంబర్ 28న పెళ్లి చేసుకున్నారు. ఇక దేశముదురు హీరోయిన్ హాన్సిక మోత్వాని కూడా తన స్నేహితుడు సోహైల్ కథురియాని పెళ్లాడింది. డిసెంబర్ 4న వీరి మ్యారేజ్ జరిగింది. హాన్సిక కూడా తన మ్యారేజ్ కేవలం అతి తక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వెల్ విషర్స్ సమక్షంలోనే ఒక్కటయ్యారు..
 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.