Begin typing your search above and press return to search.
యూఎస్ లో తెరుచుకున్న థియేటర్లు.. చిగురిస్తున్న ఓవర్సీస్ మార్కెట్ ఆశలు..!
By: Tupaki Desk | 24 Jun 2021 5:31 AM GMTకరోన మహమ్మారి కారణంగా పూర్తి స్థాయిలో సినిమా థియేటర్స్ - మల్టీప్లెక్స్ లు నడిచి ఏడాది దాటిపోయింది. యూఎస్ఏ లో ఆ మధ్య పాక్షికంగా థియేటర్స్ ఓపెన్ చేశారు. అయితే ఇప్పుడు సాదారణ పరిస్థితులు ఉండటంతో ఈరోజు(జూన్ 24) నుంచి ఎటువంటి పరిమితులు లేకుండా థియేటర్లు తెరుచుకోబడుతున్నాయి. అమెరికాలో అతి పెద్ద థియేటర్ చెయిన్ సిస్టమ్ అయిన AMC వారు ఇప్పటికే 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిచారు. యూఎస్ లో జనాలు సినిమాలు చూడటానికి థియేటర్లకు వచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గింది కాబట్టి ఎప్పటిలాగే సినిమాలు చూడటానికి వస్తారని థియేటర్ యాజమాన్యాలు భావిస్తున్నాయి.
మనదేశంలో కూడా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఇండస్ట్రీలో పరిస్థితులు సాదారణ స్థితికి వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ సడలించి థియేటర్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతి ఇస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేసిన సంగతి తెలిసిందే. ఏపీలో కూడా పర్మిషన్ వస్తే జూలై ఫస్ట్ వీక్ నుంచి సినిమా హాళ్లు తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే విడుదల వాయిదా పడిన సినిమాలన్నీ మళ్ళీ క్యూ కట్టనున్నాయి. యూఎస్ఏ లో ఈరోజు నుంచి 100 శాతం సామర్థ్యంతో థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు కనుక.. మళ్ళీ తెలుగు సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.