Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: థియేట‌ర్ల‌కు పూర్వవైభ‌వం రానుందా?

By:  Tupaki Desk   |   4 Dec 2020 2:30 AM GMT
ట్రెండీ టాక్‌: థియేట‌ర్ల‌కు పూర్వవైభ‌వం రానుందా?
X
ఎనిమిది నెల‌ల‌ త‌రువాత థియేట‌ర్లు తెరుచుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో ప్రేక్ష‌కుల ఎదురుచూపుల‌కు ఇక‌ తెర‌ప‌డుతోంది. ఈ నెల 4 నుంచి మ‌ల్టీప్లెక్స్ ‌లు రీఓపెన్ అవుతున్న విష‌యం తెలిసిందే. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌తో పాటు ఇండస్ట్రీ వ‌ర్గాల్లోనూ నూత‌నోత్సాహం ఉర‌క‌లేస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం కోవిడ్ నిబంధ‌న‌ల్ని పాటిస్తూ థియేట‌ర్స్ ‌ని రీఓపెన్ చేసుకునేందుకు జీవోని జారీ చేసింది.

థియేట‌ర్స్ యాజ‌మాన్యాలు దీనికి హ‌ర్షం వ్య‌క్తం చేశాయి. కోవిడ్ నిబంధ‌న‌లు స‌హా 50 శాతం మాత్ర‌మే ఆక్యుపెన్సీ వంటి విధానాల‌పై ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపి చివ‌రికి ఈ నెల 4న థియేట‌ర్ల‌ని రీఓపెన్ చేయ‌డానికి ఎగ్జిబిటర్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో స‌గ‌టు ప్రేక్ష‌కుడు .. ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రీస్థితుల దృష్ట్యా టిక్కెట్ ధ‌ర పెంచుకునే వెసులుబాటు క‌ల్పించినా థియేట‌ర్స్ యాజ‌మాన్యం మాత్రం యథాత‌దంగా పాత రేట్ల‌నే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యానికి వచ్చారు.

థియేట‌ర్లు అయితే ఓపెన్ అవుతున్నాయి. కానీ ప్రేక్ష‌కుడి స్పంద‌న ఎలా వుంటుందో అన్న‌ది ఇక్క‌డ ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. అంద‌రి దృష్టి ప్ర‌స్తుతం దీని పైనే వుంది. మునుప‌టిలా థియేట‌ర్ల‌‌కి వ‌స్తారా రారా? అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. భ‌విష్య‌త్ లో వినోద రంగంలో ఏం జ‌ర‌గ‌బోతోంది. ప్రేక్ష‌కుడి స్పంద‌న ఏంటి అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం బొమ్మ ప‌డే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.