Begin typing your search above and press return to search.

దేశంలో తొలిగా అక్క‌డే సినిమా హాళ్లు తెరిచేది!

By:  Tupaki Desk   |   27 Sep 2020 8:50 AM GMT
దేశంలో తొలిగా అక్క‌డే సినిమా హాళ్లు తెరిచేది!
X
అన్ లాక్ 4.0 నియ‌మాల ప్ర‌కారం సినిమా హాళ్లు తెరిచేందుకు వీల్లేదు. త్వ‌ర‌లోనే కేంద్రం థియేట‌ర్లు తెరుచుకునేందుకు అనుమ‌తులు ఇవ్వ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. దీనిపై ఇటు టాలీవుడ్ లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఐదారు నెల‌లుగా థియేట‌ర్లు మూసేయ‌డంతో వేలాది మంది కార్మికులు ఉపాధి లేక‌ రోడ్డున ప‌డ్డారు. కొంద‌రు అశువులు బాసారు.

అందుకే ఈ రంగాన్ని బ‌తికించేందుకు థియేట‌ర్లు తెరిచేలా కేంద్రం నిర్ణ‌యం తీసుకోవాల‌ని మ‌ల్టీప్లెక్స్ వోన‌ర్స్ సంఘం ఇదివ‌ర‌కూ కేంద్రాన్ని క‌లిసింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అనుమ‌తులు ద‌క్క‌లేదు. ఇండోర్ ప్ర‌దేశాల్లో సామూహిక జ‌నాల‌కు వ్యాధి వేగంగా ప్ర‌బ‌లుతుంద‌న్న భ‌యాందోళ‌న‌ల న‌డుమ కేంద్రం దిగి రాలేదు. అయితే అక్టోబ‌ర్ నుంచి తెరిచే వీలుంద‌ని ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వేడెక్కిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో అంద‌రి కంటే ముందు తొలిగా ప‌శ్చిమ బెంగాల్ లో థియేట‌ర్లు తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్ లో అక్టోబర్ 1 నుండి పరిమిత సంఖ్యలో టికెట్లు అమ్ముతూ సినిమా హాళ్ళు ఓపెన్ ఎయిర్ థియేటర్లను తిరిగి తెరవడానికి అనుమతించారు. ఆ మేర‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో ఈ సంగ‌తిని చెప్పారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలో సంగీత.. నృత్య కార్య‌క్ర‌మాలు.. మ్యాజిక్ షోలకు అనుమతి ఉంటుందని సిఎం తెలిపారు.

సినిమా హాల్స్ స‌హా ఓపెన్ ఎయిర్ థియేటర్లు సాధారణ స్థితికి రావడానికి కొన్ని చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్నారు‌. జాత‌ర‌లు.. నాటకాలు.. OAT లు.. సినిమాస్ అలానే అన్ని సంగీతం- నృత్యం- పారాయణం ప్రదర్శనలు 50 మంది పాల్గొనేందుకు వీలుండేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అక్టోబర్ 1 నుండి తక్కువ సంఖ్య‌లో తొలిగా ఇవ‌న్నీ పని చేయడానికి అనుమతులివ్వ‌నున్నారు.

హాల్స్ పునఃప్రారంభం సంద‌ర్భంగా సామాజిక‌ దూర నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ముసుగులు ధరించడం.. ముందు జాగ్రత్త ప్రోటోకాల్ ‌లకు లోబడి ప్ర‌తిదీ ఉంటుందని ముఖ్యమంత్రి మ‌మ‌తా బెనర్జీ ట్విట్టర్ లో తెలిపారు. మార్చి చివరిలో దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి సినిమా హాళ్ళు మూసివేసిన సంగ‌తి తెలిసిన‌దే.