Begin typing your search above and press return to search.

మహమ్మారి పుట్టినింట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేయబోతున్నారా...?

By:  Tupaki Desk   |   17 July 2020 1:30 AM GMT
మహమ్మారి పుట్టినింట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేయబోతున్నారా...?
X
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడిపోతోంది. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై పడింది. ఇక ఈ మహమ్మారి ఎఫెక్ట్ ఎక్కువగా పడిన రంగాలలో సినీరంగం ఒకటి. దీని వలన గత నాలుగు నెలలుగా సినిమా షూటింగులు ఆగిపోయాయి. థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతబడి ఉన్నాయి. దీంతో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. మనదేశంలో కూడా సినిమా రిలీజ్ అవ్వక 100 రోజులు దాటిపోయింది. అయితే ఈ మధ్య కొన్ని దేశాల్లో నిబంధనలు సడలిస్తూ వస్తున్నారు. అక్కడక్కడ థియేటర్స్ కూడా రీ ఓపెన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ లో థియేటర్స్ తెరుచుకోగా.. సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్స్ కి తరలి వచ్చారు. ఈ క్రమంలో చైనా లో కూడా థియేటర్స్ రీ ఓపెన్ చేసే ఆలోచన చేస్తున్నారట.

కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకొనే చైనా దేశం కూడా మహమ్మారి కారణంగా వణికిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే చైనాలో వైరస్ ప్రభావం తగ్గుతూ వస్తుండటంతో జనాలు సాధారణ జీవనాన్ని గడపటం స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాలో ఈ నెల ఆఖరుకి సినిమా థియేటర్స్ తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ముందుగా కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ఏరియాల్లో మాత్రమే తెరవాలని అనుకుంటున్నారట. అందుకోసం థియేటర్స్ లో 70 శాతం ఆక్యుపెన్సీని తగ్గించడంతో పాటు లిమిటెడ్ షోస్ ప్రదర్శించాలని చూస్తున్నారట. సీట్స్ మధ్య చాలా దూరం ఉండేలా చూస్తున్నారట. అంతేకాకుండా థియేటర్స్ సేఫ్టీ మెజర్స్ పాటించడంతో పాటు శానిటైజర్స్ మాస్కులు కంపల్సరీ చేయనుందట. మరి చైనా తీసుకోబోతున్న ఈ నిర్ణయం వారికి ఎలాంటి రిజల్ట్ చూపిస్తుందో చూడాలి. ఇక మనదేశంలో షూటింగులకు అనుమతులిచ్చినా థియేటర్స్ రీ ఓపెన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారు అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది.